అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఉల్లి చేసే మేలు తల్లి చేయదనేది నానుడి…మన దగ్గర ఉల్లిపాయను వాడని కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. కూర, పప్పు, పులుసు, పచ్చడి… ఇలాగ ఇంట్లో తినే ఆహారపదార్ధాలతో పాటు, మద్యం సేవించేటప్పుడు కూడా ఉల్లిపాయను వాడుతూనే ఉంటాం.  మనదేశంలో ఉల్లికున్న ప్రాధాన్యం అలాంటిది. కానీ ఇప్పుడు అమెరికన్లు ఉల్లి పేరు చెపితేనే వణికి పోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయల వల్ల భయంకర మైన వ్యాధిని కలిగిస్తున్నాయట.దీని గురించి అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలోవెల్లడించింది. అమెరికా, కెనడాల్లో ఇటీవల సాల్మోనెల్లా (ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే బ్యాక్టీరియా) వ్యాధి గ్రస్తుల కేసులు ఎక్కువయ్యాయట. ఇప్పటి వరకు 34 రాష్ట్రాల్లో 400 మంది ఈ బాక్టీరియా బారిన పడినట్లు తెలుస్తోంది.సాల్మోనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా డయేరియా జ్వరం కడుపు నొప్పి వంటివి వస్తాయి.

సాల్మోనెల్లా వ్యాధి లక్షణాలు
సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయి. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయి. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్లకుండానే రికవరీ అవుతారు. ముసలి వాళ్లు, పిల్లలకు ఈ సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడమే మేలు. సాల్మొనెల్లో సోకితే… ఎక్కువ నీరు తాగాలి.ఇది ఒక్కొక్కరిలో ఆరు గంటలపాటూ ఉంటుంది. బ్యాక్టీరియా సోకిన ఆరు గంటల తర్వాత ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరిలో ఆరు రోజుల తర్వాత కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. అమెరికా, కెనడాకు నౌకల్లో వెళ్లిన ఎర్ర ఉల్లిపాయల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరిందని భావిస్తున్నారు.ఈ ఉల్లిపాయలు… అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటూ, కెనడాలోని అన్ని సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లకు ఆగస్ట్ 1న సరఫరా చేశారు. వీటిలో ఎరుపు, పసుపు, తెలుపు, తీపి పసుపు రంగు ఉల్లిపాయలున్నాయి. వీటన్నింటిలో కన్నా కూడా ఎర్ర ఉల్లిపాయల్లో ఎక్కువగా సాల్మొనెల్లా వైరస్ ఉన్నట్లు గుర్తించింది సీడీసీ. థాంప్సన్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చిన అన్ని రకాల ఉల్లిపాయలనూ వాడవద్దని సీడీసీ ప్రజలను హెచ్చరించింది.

READ  ఇన్‌స్టాగ్రామ్‌ లో కొత్త ఫీచర్ : బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలు

Related Posts