దావుద్ కరాచీలోనే ఉన్నాడు.. ఒప్పుకున్న పాకిస్థాన్.. ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి ప్రపంచ ఉగ్రవాది జాకియూర్ రెహ్మాన్ లఖ్వీ సహా Hafiz Saeed, Masood Azhar, Dawood Ibrahim లపై పాకిస్తాన్ ఆర్థిక ఆంక్షలు విధించింది. అంతేకాదు.. వారి బ్యాంకుల అకౌంట్లు, ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది.. ముంబై పేలుళ్ల ఘటనలో 160 మంది భారతీయులు మరణించారు. 300 మంది వరకు గాయపడ్డారు. ముంబై పేలుళ్ల కుట్రదారులకు అప్పగించాలని కొన్నేళ్లుగా భారత్ డిమాండ్‌ చేస్తూనే ఉంది..

అయినప్పటికీ పాకిస్థాన్ ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ దాటవేస్తూ వస్తోంది. 2008లో, 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబై పేలుళ్లకు పాల్పడ్డారు. అమాయకులపై అనేక చోట్ల విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల్లో అజ్మల్ కసాబ్ ఒక్కడే ప్రాణాలతో దొరికాడు.. కోర్టు విచారణ తరువాత 2012లో కసబ్‌ను భారత్ ఉరితీసింది..

అంతర్జాతీయ ఉగ్రవాద నిరోధక చర్యల వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) రూపొందించిన గ్రే లిస్టులో పాకిస్తాని ఇప్పటికీ కొనసాగుతోంది. ఉగ్ర వాదులకు ఆర్థిక సహాయం అందిస్తున్న దేశాలు, సంస్థలపై FATK కొరడా ఝళిపిస్తోంది. 2018లో పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో ఉంచింది. అక్టోబర్ 2019లో పారిస్ సమావేశంలో ఈ జాబితా నుంచి తప్పించడానికి పాకిస్తాన్‌కు 2020 ఫిబ్రవరి వరకు సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాది లఖ్వీనికి కొంతకాలం పాకిస్తాన్ జైలు శిక్ష విధించింది.. ముంబై పేలుళ్ల ఘటనలో అతడి ప్రమేయం ఉందంటూ భారతదేశం ఆధారాలు ఇచ్చినప్పటికీ పాక్ అతన్ని బెయిల్‌పై విడుదల చేసింది.. మరో సూత్రధారి హఫీజ్ సయీద్ కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నాడు. ముందస్తు నోటీసు లేకుండా.. ఈ వ్యక్తులు, సంస్థల నిధులు, ఇతర ఆర్థిక ఆస్తులు అని లఖ్వికి వ్యతిరేకంగా పాకిస్తాన్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది.. ఉగ్రవాది విదేశాలకు వెళ్లడాన్ని నిషేధించనుంది.

దేశంలో ఉగ్రవాద ఫైనాన్సింగ్‌‌పై కఠినమైన చర్యలు తీసుకోనందుకు పారిస్‌కు చెందిన FATF సంస్థ 2018 జూన్‌లో పాకిస్థాన్‌ను గ్రే లిస్టులో చేర్చింది. 2019 చివరి నాటికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఇస్లామాబాద్‌ను కోరింది. కాని COVID-19 మహమ్మారి కారణంగా గడువును పొడిగించారు.

అక్టోబర్ నాటికి పాకిస్తాన్ FATF ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని దేశాన్ని ఉత్తర కొరియా, ఇరాన్‌లతో పాటు బ్లాక్ లిస్ట్ లోకి పెట్టే అవకాశం ఉంది.. లోకి నెట్టవచ్చు.

ఈ నెల ప్రారంభంలో.. పాకిస్తాన్ పార్లమెంటు FATF ఏర్పాటు చేసిన షరతులతో కూడిన నాలుగు బిల్లులను క్లియర్ చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఇటీవల విడుదల చేసిన కొత్త టెర్రర్ జాబితాకు అనుగుణంగా జమాత్-ఉద్- వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన Jamaat-ud-Dawa (JuD), JeM, Taliban, Daesh, Haqqani Group, al-Qaeda ముఖ్య వ్యక్తులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

READ  పాకిస్తాన్ కుట్ర : మసూద్ అజార్ చనిపోయాడని దుష్ప్రచారం

ఇంటర్‌పోల్, నూర్ వాలి మెహసూద్, ఉజ్బెకిస్తాన్ లిబరేషన్ మూవ్‌మెంట్‌కు చెందిన ఫజల్ రహీమ్ షా, తాలిబాన్ నేతలు జలాలుదిన్ హఖిల్‌ఖిల్ హఖిల్ హదీల్ యాహ్యా హక్కానీ, ఇబ్రహీం అతని సహచరులు ఈ జాబితాలో ఉన్నారు.

Related Posts