మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెంతులు చూడగానే చాలా మందికి వద్దురా బాబు అవి చాలా చేదుగా ఉంటాయ్ అని వాటిని పక్కన పెడతారు. మెంతులు వంటల్లో సువాసన కోసం మాత్రం కాదు, మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు ప్రతి వంటకంలో మెంతులను వాడేవారు. మెంతులను ఎక్కవగా పులుసు,పచళ్లు, పోపుల్లో ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి మెంతులను మనం రెగ్యులర్ గా వాడాలి. మన ఇళ్లలో పోపు డబ్బాల్లో మిగత పప్పు దినుసులతో పాటు మెంతులను కచ్చితంగా ఉంచుతారు. మెంతులను డైరెక్టుగా వాడినా, నానబెట్టి వాడినా , పొడి చేసి వాడినా ప్రయోజనమే. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాంటి మెంతుల ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడతాయో, వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం…..
> మెంతుల్లో పోషకాలు, ఫైబర్, ఐరన్, విటమిన్ C,విటమిన్ B1,విటమిన్ B2,కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

> జుట్టు సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక సరైన పరిష్కారం. మెంతులను నానబెట్టి ఆ నీటిని జుట్టుకి పట్టించండి. మంచి ఫలితం ఉంటుంది. మెంతుల్ని పెరుగులో నానబెట్టి మిక్సీలో జ్యూస్‌లా చేసి, దాన్ని తలకి ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేతే చాలు. జుట్టు సమస్యలను దూరం అవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. రంగు కూడా నెరవకుండా ఉంటుంది. ఎన్నో లాభాలుంటాయి.
> డయాబెటిస్ తో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యానికి మెంతులు ఎంతో ఉపయోగపడతాయి.

> శరీరంలో కొలస్ట్రాల్ సరైన మోతాదులో ఉంచేందుకు, శరీరంలో కొవ్వును తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. కండరాల నొప్పులకు కూడా మెంతులు ఓ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
> జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతుల్ని వాడితే చాలు. వాటిలో ఉండే ఫైబర్ ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మెంతుల్ని నానబెట్టి ఆ నీరు తాగితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ మెంతుల్ని నానబెట్టి, ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. విరేచ‌నాలు త‌గ్గ‌డానికి కూడా మెంతులు తోడ్ప‌డుతాయి.

> బాలింతలు మెంతుల్ని గింజల రూపంలో తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది. మెంతుల్ని కషాయంగా చేసుకుని తాగినా.. మెంతికూర పప్పు తిన్నా… పాల ఉత్పత్తి పెరుగుతుంది.
> మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. దాంతో మ‌నం ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. దానివ‌ల్ల శరీరంలోని కొవ్వు క‌రుగుతుంది. కాబ‌ట్టి స్థూల‌కాయులు ప్రతిరోజు మెంతులు తీసుకోవటం మంచిది.

Related Posts