భారత్-చైనా సరిహద్దులో యుద్ధ విమానాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమౌతోంది. బోర్డర్ లో డ్రాగెన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో- చైనా బోర్డర్ లోని ఫార్వర్డ్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను దించింది భారత్ ఆర్మీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ లో పాచీ, మిగ్-29 యుద్ధ విమానాలు ఎయిర్ ఆపరేషన్ లో పాల్గోనేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని ఆర్మీ చెప్పింది. సవాళ్లను అధిగమించే సత్తా ఇండియాకు ఉందని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సైనికులంతా సువిక్షితులు అని కొనియాడింది. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ జోష్ ఎప్పుడూ గొప్పగా ఆకాశాన్ని తాకేంతగా ఉంటుందని పేర్కొంది.

సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ దగ్గర కమాండర్స్, ఎక్విప్ మెంట్స్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆపరేషన్ టాస్క్ నిర్వహించేందుకు ఐఏఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. మిలిటరీ ఆపరేషన్స్ కు అవసరమైనవి సమకూర్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Related Posts