Final Judgment of Ayodhya Case..High security to the Tirumala Sri Venkateswara temple

అయోధ్య తీర్పు : తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ భద్రత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

 రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. తిరుమల కొండ కింద తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం, తిరుమల జీఎన్సీలో తనిఖీలను ముమ్మరం చేశారు. 1650 సీసీ కెమెరాల ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

కాగా రామజన్మభూమి అయోధ్య తీర్పు రానున్న క్రమంలో భారతదేశంలోని అన్ని ప్రధాన..చారిత్రాత్మక దేవాలయాల్లోను భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ తీర్పు రానున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దేవాలయంలో అణువణువులను నిఘా కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్నిప్రాంతాల్లోను తనిఖీలతో అనుక్షణం అప్రమత్తంగా ఉన్న అధికారులు ప్రతీ వాహనానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. 

Related Posts