final-year-exams-to-be-held-says-supreme-court1

ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 30న యథాతథంగా ఎగ్జామ్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాలేజీలు, యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఎగ్జామ్స్ నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని రాష్ట్రాలకు సూచించింది. ఒకవేళ కరోనా దృష్ట్యా ఇబ్బందులు ఉంటే, యూజీసీని ఆశ్రయించాలని కోర్టు సూచించింది.



పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్ చేయొద్దు:
యూజీసీ ఫైనలియర్ పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం(ఆగస్టు 27,2020) కొట్టేసింది. పరీక్షలు రాయకుండా ఎవరినీ ప్రమోట్‌ చేయవద్దని సూచించింది. సెప్టెంబర్ 30న యథాతథంగా యూజీసీ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. యూజీసీ గైడ్‌లైన్స్‌ని‌ ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

లక్షణాలు లేకపోతే..టెస్టులు ఎందుకు ?


కరోనా నేపథ్యంలో ఫైనలియర్ పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్:
కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫైనలియర్‌ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయాల్సిందిగా ఆదిత్య ఠాక్రేకు చెందిన యువసేనతో సహ పలు సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. కరోనా వైరస్‌ కారణంగా విద్యాసంస్థలు మూసి వేశారని.. ఇలాంటి పరిస్థితుల్లో​ పరీక్షలు పెడితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని పిటిషన్‌దారులు కోర్టుకు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు రద్దు చేయాలని పిటిషన్‌దారులు కోర్టును కోరారు.



ఇప్పటికే విద్యార్థులు ఐదు సెమిస్టర్లు పూర్తి చేశారని.. వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించాలన్నారు. ఈ పిటిషన్లను నేడు విచారించిన సుప్రీంకోర్టు యూజీసీ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్‌ చేయడాన్ని ప్రోత్సాహించదని రాష్ట్రాలను కోరింది కోర్టు. కాగా, విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం అవసరం అయితే రాష్ట్రాలు ఎగ్జామ్స్ ను వాయిదా వేయొచ్చన్న కోర్టు, అదే సమయంలో యూజీసీతో చర్చించి తప్పనిసరిగా కొత్త పరీక్షల తేదీలను ప్రటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Related Posts