లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బడ్జెట్ 2021 సందర్భంగా మొబైల్ యాప్ లాంచ్ చేసిన మంత్రి నిర్మలా సీతారామన్

Published

on

sitharaman-nirmala

Budget-2021: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ పురస్కరించుకుని యాప్ రిలీజ్ చేశారు. బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందు జరిపే హల్వా సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్ ను 2021-22 బడ్జెట్ చివరి దశలో జరుపుతారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా స్టేట్‌మెంట్ వెల్లడించారు.

ఏటా హల్వా సెలబ్రేషన్ లో పాల్గొన్న అధికారులు.. పది రోజు తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకూ కాన్ఫిడెంట్ గా ఉంచుతారు. కాకపోతే రీసెంట్ గా ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తొలిసారి కాగిత రహిత బడ్జెట్ గా ఉండనుంది. 2021 ఫిబ్రవరి 1న దీనిని ప్రవేశపెడతారు.

ఈ సందర్భంగా సీతారామన్ శనివారం యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ను లాంచ్ చేశారు. దీని వల్ల ఎంపీలు ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లు అందులో యాక్సెస్ చేసుకోవచ్చు. డిజిటల్ కన్వినెన్స్ ఉన్న మీదట వాటిని జనరల్ పబ్లిక్ కూడా చూసేందుకు వీలుంటుంది.

ఈ మొబైల్ యాప్‌లో 14కేంద్ర బడ్జెట్ డాక్యుమెంట్లు ఉంటాయి. వార్షిక ఆర్థిక లావాదేవీలు, అనుమతులకు సంబంధించిన డిమాండ్, ఆర్థిక బిల్లు లాంటివి రాజ్యాంగంలో పొందుపరిచినట్లు ఇందులోనూ కనిపిస్తాయి.

ఈ యాప్ మొత్తం యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో డౌన్ లోడింగ్, ప్రింటింగ్, సెర్చ్, జూమ్ చేసుకోవడం, పైకి కిందకు స్క్రోలింగ్ చేసుకోవడం లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది మొత్తం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. దీనిని యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in)లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) గైడెన్స్ అనుసరించి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) దీనిని డెవలప్ చేసింది.

ఇందులో బడ్జెట్ డాక్యుమెంట్లు బడ్జెట్ స్పీచ్ అయిపోయిన వెంటనే ఫిబ్రవరి 1నాటికి అందుబాటులో ఉంటాయి.