హైదరాబాద్ ఆబిడ్స్ లో అగ్ని ప్రమాదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

fire accident abids, gunfoundry : హైదరాబాద్ ఆబిడ్స్ లోని గన్ ఫౌండ్రీలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మొదట ఓ హోటల్ కిచెన్ లో చెలరేగిన మంటలు…పక్కనే ఉన్న ఓ చెప్పుల గొడౌన్ కు వ్యాపించాయి. గోడౌన్ లోని చెప్పులు, హోటల్ లోని ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్ధలానికి వచ్చి మంటలను అదుపు చేశాయి.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా.. లేక ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు.. ఎంతమేర ఆస్తినష్టం జరిగిందో తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.


Related Tags :

Related Posts :