లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మన్నార్ గుడిలో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి

Published

on

The Fire accident is in the fireworks factory in the  of Thiruvarur district

తిరువారూర్ : తమిళనాడు తిరువారూర్ జిల్లా మాన్నార్ గుడిలో బాణసంచా కర్మాగారంలో హఠాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మణం పాలవ్వగా.. మరోఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను మన్నార్ గుడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పాతబడిన భవనం కావడంతో ఈ పేలుడు ధాటికి మొత్తం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సింగారవేలు, సురేష్, బాబు, మోహన్, వీరయ్యన్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మృతి చెందిన సింగారువేలు ఎటువంటి అనుమతులు లేకు బాణసంచా కర్మాగారాన్ని ఏర్పాటు చేసి మందుగుండు సామాగ్రి తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బాణాసంచా తయారీ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున బాణసంచా తయారీ సామాగ్రి ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువైనట్టు పోలీసులు తెలిపారు. 
Read Also : వివేకా హత్య కేసు : ఎంపీగా గెలిచేందుకే చంపేశారు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *