లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సీరం ఇనిస్టిట్యూట్‌లో మరో అగ్నిప్రమాదం..బాధిత కుటుంబాలకు 25లక్షల పరిహారం

Published

on

Fire Breaks Out Again పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. మంజ్రి బ్లాక్ ఆరో అంతస్థులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నామే సీరం ఇనిస్టిట్యూట్ లో జరిగిన అగ్రిప్రమాద ఘటనలో 5గురు మృతి చెందిన విషయం తెలిసిందే. టెర్మినల్ 1గేటు వద్ద నిర్మాణంలో ఉన్న ఎస్​ఈజెడ్​-3 భవనం 4, 5 అంతస్తుల్లో ఇవాళ(జనవరి-21,2021)మధ్యాహ్నాం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10 ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

మంటలను ఆర్పివేసిన తర్వాత ఐదు మృతదేహాలను గుర్తించారు. 10మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అయితే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోన్న యూనిట్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బిల్డింగ్ లో ఈ అగ్రిప్రమాదం జరిగిన నేపథ్యంలో వ్యాక్సిన్ గురించి ఆందోళనలు వ్యక్తమవగా సీరం సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. అగ్నిప్రమాద ఘటనతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం లేదని సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.

ఇక,సీరం ఇనిస్టిట్యూట్ లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోడీ వాకబు చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం దురదృష్టకరమని మోడీ అన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు, రేపు ఉదయం సీరం ఇనిస్టిట్యూట్ ని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సందర్శించనున్నారు. అగ్నిప్రమాదం,వ్యాక్సిన్ భద్రతను పరిశీలించనున్నారు.

అగ్నిప్రమాదంపై సీరం సీఈవో అదార్ పూనావాలా విచారం వ్యక్తం చేశారు. ఈ రోజు మనందరికీ చాలా దుఖ:ఖరమైన రోజు అని పూనావాలా తెలిపారు. తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు నిబంధనలకు అనుగుణంగా ఇచ్చేదానికి అదనంగా ఒక్కో బాధిత కుటుంబానికి మరో 25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు అదార్ పూనావాలా ప్రకటించారు.