Fires at Parry Sugar Factory in srikakulam

ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్యారీ చక్కెర ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. చెరకు వేస్టేజ్ కు నిప్పంటుకొని మిషనరీకి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు ఎగిసిపడటంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రాజాం, పాలకొండ ప్రాంతాల మీదుగా వచ్చి రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో 80 శాతం మంటలను అదుపులోకి తెచ్చారు. మిషనరీకి మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

మంటల తీవ్రతను అదుపు చేసేందుకు ప్రైవేట్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ షర్క్యూట్ కారణమా లేదా చెరకు పిప్పికి మంటలు అంటుకోవడం కారణంగా ప్రమాదం సంభవించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Related Posts