కొవాక్సిన్ ట్రయల్స్ ఏప్రిల్ వరకూ.. ఎమర్జెన్సీ అయితే ముందే వాడొచ్చు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండియా తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ ను తయారుచేస్తున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్.. COVAXIN. దీని ట్రయల్స్ పూర్తి చేసుకోవడానికి దాదాపు ఏప్రిల్ 2021 వరకూ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే కంపెనీకి కమర్షియల్ లైసెన్సింగ్, WHO-ప్రీ క్వాలిఫికేషన్ వస్తుందని టాప్ అఫీషియల్ కంపెనీ చెప్పుకొచ్చింది.

ఏదేమైనప్పటికీ కొవాక్సిన్ ను ఎమర్జెన్సీ సమయాల్లో ప్రభుత్వం నిర్ణయిస్తే వాడుకోవచ్చని తెలిపింది. మూడో దశ ట్రయల్స్ పూర్తయ్యేలోపే ఇలా ప్రొసీడ్ అవ్వొచ్చని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సాయి ప్రసాద్ చెప్పారు.నవంబరులో ఫేజ్ 3 స్టడీస్ మొదలుకానుయి. ఏప్రిల్ లేదా మే 2021 నాటికి పూర్తిగా రెడీ అయిపోతుంది. మా ప్రాజెక్టుల గురించి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకుంటున్నాం. వ్యాక్సిన్ విడుదల చేయడంపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చలు జరుపుతుంది. అని ఆయన చెబుతూ అవసరమైతే సంవత్సరానికి 150 మిలియన్ డోసులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

Related Tags :

Related Posts :