కరోనా సోకిన మొదటి కుక్క మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా మహమ్మారి మనుషులతో పాటు మూగ జీవాల ప్రాణాలకు కూడా హరించేస్తోంది. మనుషుల నుంచి పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులకు కూడా ఈ వైరస్ సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలో పెంపుడు జంతువులకు కరోనా వైరస్ సోకినట్లుగా నిర్థారణ అయ్యింది. ఈక్రమంలో కరోనా వైరస్ అని నిర్దారణ అయిన మొదటి కుక్క మరణించింది. అమెరికాలోని జర్మన్‌ షెఫెర్డ్‌ జాతికి చెందిన ఏడు సంవత్సరాల వయస్సున్న కుక్క బడ్డీకి కరోనా పాజిటివ్ వచ్చింది.ఆ కుక్క మరణించిందని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్ ప్రచురించింది. అమెరికాకు చెందిన రాబర్ట్ మహూనీ అనే వ్యక్తి దగ్గర ఏడేండ్ల వయసున్న శునకం ఉండేది. ఏప్రిల్‌లో అతనికి కరోనా సోకింది. తరువాత కరోనా నుంచి కోలుకున్నాడు. ఆ తర్వాత ఆయన పెంపుడు కుక్క బడ్డీకి అనారోగ్యం బారినపడింది. దానికి కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది. ఊపిరి తీసుకోవటంలో తీవ్రంగా యతనపడుతు కుక్క చనిపోయింది. జూలై 11 న బడ్డీ రక్తం గడ్డకట్టడం..రక్తం మూత్ర విసర్జన చేయడంలో తేడా..నడవలేక పోయేదని..ఈ క్రమంలో చనిపోయిందని చెప్పారు.


Related Posts