అరచేతి సైజులో ఫస్ట్ iPhone 12 Mini.. ఎంత చిన్నదిగా ఉందో చూడండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

First iPhone 12 mini : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీ నుంచి అరచేతి సైజులో ఫస్ట్ ఐఫోన్ వచ్చేసింది. అతి చిన్నదైన 12 mini ఐఫోన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆపిల్ రెండు సైజుల్లో ఐఫోన్లను లాంచ్ చేసింది.అందులో ఒకటి iPhone 12, iPhone 12 Pro.. అయితే నవంబర్ 6 నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్లపై ప్రీ-ఆర్డర్లు ప్రారంభించనుంది.First iPhone 12 mini

అప్పటివరకూ ఆగలేరా? అయితే ఆపిల్ ఈ ఏడాదిలో అందిస్తోన్న అతి చిన్న ఐఫోన్ iPhone 12 min మోడల్ ఒకటి.. అరచేతి సైజులో ఐఫోన్ తీసుకు రావడం ఇదే ఫస్ట్ టైం కూడా.. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది.40 నిమిషాల నిడివి గల వీడియోలో అరచేతిలో ఇమిడిపోయిన మినీ ఐఫోన్ ఎలా ఉందో చూడొచ్చు.. 5.4 అంగుళాలు స్ర్కీన్ ఉంది.. ఐఫోన్ 12తో మొదట ప్రవేశపెట్టిన మోడ్రాన్ నాచ్‌డ్ డిస్‌ప్లే డిజైన్ కూడా.
First iPhone 12 miniసెకండ్ జనరేషన్ iPhone SE మాదిరిగా ఇందులో ఎలాంటి బెజెల్స్ లేవు.. ఇంతకీ దీని ప్రారంభ ధర 699 డాలర్లు. అంటే… 6.1 అంగుళాల iPhone 12 ఫోన్ ధర కంటే 100 డాలర్లు తక్కువగా ఉంటుంది.ఈ ఏడాది 2020లో ఐఫోన్ లైనప్ లో ఆపిల్ మొత్తంగా సింగిల్ ప్రొడక్ట్ సైకిల్‌ కింద మూడు ప్రత్యేకమైన వేర్వేరు సైజుల్లో ఐఫోన్లను లాంచ్ చేసింది. ఐఫోన్ 11 మోడల్ కంటే 6.1 అంగుళాల ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో సైజు చాలా చిన్నదిగా ఉంటాయి.ఐఫోన్ 11 ప్రో కంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉంటుంది. స్మాల్ డిస్ ప్లేతో పాటు బ్యాటరీ కూడా చిన్నదిగా ఉంటాయి. వచ్చే నవంబర్ 6న ఐఫోన్ 12 మినీపై ప్రీ ఆర్డర్లు మొదలవుతాయి.. నవంబర్ 23న సేల్స్ మొదలు కానున్నాయి.

Related Tags :

Related Posts :