బాలయ్య చేతుల మీదుగా ‘సెహరి’ ఫస్ట్‌లుక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sehari First Look: టాలీవుడ్‌కి హర్ష్ కానుమిల్లి అనే కొత్త హీరో పరిచయమవుతున్నాడు. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయమవుతున్నారు.. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై శిల్పా చౌదరి, అద్వయ జిష్ణు రెడ్డి నిర్మిస్తున్నారు. హర్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను నటసింహా నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు.

Image

ఈ సినిమాకు ‘సెహరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హర్ష్ హీరోగా నటించడంతో పాటు రచన కూడా చేయడం విశేషం. హర్ష్ కష్టపడి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటూ బాలయ్య అతనికి ఆశీస్సులు అందించి.. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.


నయనతార ‘అమ్మోరు తల్లి’ – రివ్యూ


త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాదిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు కొద్దిరోజుల్లో తెలియజేయనున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : సురేష్ సారంగం, ఎడిటింగ్ : రవితేజ గిరిజాల.

Image

Related Tags :

Related Posts :