లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సంక్రాంతి సంధర్భంగా ‘కెనడి క్లబ్’ ఫస్ట్‌లుక్ విడుదల

Published

on

క్రీడల నేపధ్యంలో వచ్చే సినిమాలను తెలుగు ప్రక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందులోనూ కొత్తరకం కథనంలో వస్తే.. కొత్తా పాత అనే తేడా లేకుండా హిట్ చేసేస్తారు.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఆ విధంగా తెలుగులో హిట్ అయ్యాయి.

ఆ నమ్మకంతోనే లేటెస్ట్‌గా శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై శశి కుమార్, భారతి రాజా, మీనాక్షి గోవిందరాజన్, సూరి ప్రధాన పాత్రలో సుశీంద్రన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న క్రీడా చిత్రం ‘కెనడి క్లబ్’.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ సంక్రాంతి పండుగ సందర్భంగా లేటెస్ట్‌గా విడుదల చేసింది. పల్లెటూరి కథతో కబడ్డీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించగా.. సుశీంద్రన్‌కు మంచి పేరు వచ్చింది.

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనే ఉద్ధేశ్యంతో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులో సినిమాను విడుదల చేయటానికి సిద్ధమయ్యారు నిర్మాతలు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలో సందడి చెయ్యనుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.

Tamil Trailer:

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *