హ్యాపీ బర్త్‌డే.. బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘బిచ్చగాడు 2’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు. Vijay Antonyజూలై 24న విజయ్ ఆంటోని పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌గా ‘బిచ్చ‌గాడు 2’ సినిమాను చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని నిర్మాత‌గా తమిళంలో ‘పిచ్చైకారన్’, తెలుగులో ‘బిచ్చగాడు2’ రూపొందనున్న ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియా కృష్ణ‌స్వామి డైరెక్ట్ చేయనున్నారు. 2021లో ఈ సీక్వెల్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Bitchagadu 2

Related Posts