లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్ : ఫస్ట్ లుక్

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్న ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Published

on

First Look Poster of vidya balan in and as Shakuntala Devi

ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తున్న ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ ఫస్ట్ లుక్ రిలీజ్..

కథాబలమున్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ.. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ ప్రస్తుతం ఓ బయాపిక్‌లో నటిస్తోంది. ప్రముఖ గణిత శాస్త్ర నిపుణురాలు, హ్యూమన్ కంప్యూటర్‌గా పేరొందిన శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతుంది.

రీసెంట్‌గా ఈ సినిమాకు ‘శకుంతలా దేవి – హ్యూమన్ కంప్యూటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విద్యా బాలన్ ఒకటో నంబర్‌పై నిలబడగా, కంప్యూటర్ రెండు, క్యాలిక్యులేటర్ మూడో నంబర్లలో ఉన్నట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.

శకుంతలా దేవి కంప్యూటర్, క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్‌గా లెక్కలు చేస్తారని ఆమెను హ్యూమన్ కంప్యూటర్ అని సంభోదిస్తారు. సోని పిక్చర్స్ నెట్‌వర్క్స్, విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తుండగా, అను మీనన్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘శకుంతలా దేవి -హ్యూమన్ కంప్యూటర్’ వచ్చే ఏడాది విడుదల కానుంది.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *