First major step towards prohibition in AP from October 1

అక్టోబరు 1నుంచి ఏపీలో అమల్లోకి రానున్న పథకాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లోపే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అక్టోబరు 1నుంచి అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసలు ఆ పేరే వినిపించకుండా.. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా.. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా జగన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది.

* తద్వారా బెల్ట్‌ షాపులు లేకుండా చేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్‌ షాపులకు తెర పడదు. అందుకే ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

* ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన “అన్న క్యాంటీన్లు” వైఎస్ఆర్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవనున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2వ తేదీనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

* అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు సాయం,  ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అక్టోబర్ 10వ తేదీన, ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకం కింద రూ.12వేలు రైతులకు అక్టోబర్ 15వ తేదీన అందించనుంది ప్రభుత్వం. 

Related Posts