లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తొలి దశ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడత షెడ్యూల్ ఇదే

Published

on

First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని, తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా..11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.

జనవరి 23 : నోటిఫికేషన్ జారీ.
జనవరి 25 : అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం.
జనవరి 27 : నామినేషన్ల దాఖలుకు తుది గడువు.

జనవరి 28 : నామినేషన్ల పరిశీలన.
జనవరి 29 : అభ్యంతరాల పరిశీలన.
జనవరి 30 : అభ్యంతరాలపై తుది నిర్ణయం.

జనవరి 31 : నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.
మధ్యా్నం 3 గంటల తర్వాత..పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల.
ఫిబ్రవరి 05 : పోలింగ్.

ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 03.30 మధ్య పోలింగ్.
అదే రోజు..మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక.

ఫిబ్రవరి 05 : ముగియనున్న మొదటి విడత ఎన్నికల ప్రక్రియ.