లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఈ బిగ్ స్టార్ల ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా!

Published

on

First Salary of Indian Stars: జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా, మనం ఎక్కడినుంచి వచ్చాం.. ఎంత కష్ట పడ్డాం, ఏం ప్రతిఫలం పొందాం, ఎలా డెవలప్ అయ్యాం అనే విషయాలు మర్చిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసి సక్సెస్ అయితే మన గురించి చరిత్ర చెప్తుంది.. మన జీవన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఈ మాటలు తమ చేతలతో నిజమని నిరూపించారు కొందరు సూపర్‌స్టార్స్.. కెరీర్ తొలినాళ్లలో దొరికిన పని చేస్తూ, వందల రూపాయల్లో జీతం తీసుకున్న వారే, ఆ తర్వాత సినిమాల్లో కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరా స్టార్స్, ఏంటా కథ?.. చూద్దాం..


బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, ఒక షిప్పింగ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అందుకు ఆయన అందుకున్న నెల జీతం, తొలి జీతం.. రూ.500..

Why I will never watch Amitabh Bachchan's Sooryavansham

విశ్వనటుడు కమల్ హాసన్ బాలనటుడిగా పరిచయం అయిన తమిళ చిత్రం ‘కలతుర్ కన్నమ్మ’.. 1959లో రిలీజ్ అయిన సినిమాకు పారితోషికంగా రూ.500 అందుకున్నారు కమల్.. అది కూడా ఐదేళ్ల వయసులో కావడం విశేషం.

 Kamal Haasan

ది కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ తన తొలి చిత్రం ‘మంజిల్ విరింజా పూక్కల్’ కి పారితోషికంగా రెండు వేల రూపాయలు అందుకున్నారు.

Mohanlal

బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్, బ్యాంకాక్‌లో వెయిటర్‌గా పని చేశారు. అందుకుగాను తొలి సంపాదనగా రూ.1500 జీతం తీసుకున్నారు.Akshay Kumarఈ స్టార్స్ ఇప్పుడు ఎలాంటి స్థాయిలో, హోదాలో ఉన్నారో కొత్తగా చెప్పక్కర్లేదు. పట్టుదలగా కష్టపడితే అనుకున్నది సాధించగలం అని నిరూపించి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఈ బడా స్టార్స్.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *