ఇండియాలోనే ఫస్ట్ టైం.. చిరు 65వ బర్త్‌డే స్పెషల్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెగాస్టార్ చిరంజీవి 65వ బర్త్ డేను ఇండియాలోనే ఎవరూ చేసుకోనంత స్పెషల్ గా చేసుకుంటున్నారు. ఆగష్టు 22న జరుపుకోనున్న బర్త్‌డేకు సంబంధించిన కామన్ డీపీ మరియు మోషన్ పోస్టర్‌ను 65 మంది సెలబ్రిటీలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇండియాలో ఎవ్వరూ చేయనంత స్పెషల్ గా చిరు బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

65మంది పాపులర్ సినిమా సెలబ్రిటీలను ఇండియా వ్యాప్తంగా ఉన్న వారందరితో మెగాస్టార్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్(సీఎంపీ)కోసం రెడీ చేస్తున్నారు. ఈ పోస్టర్ కు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది. సీఎంపీ లాంచ్ చేసే డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

మరో వైపు సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫుల్ జోష్ తో జరుపుకుంటున్నారు. ఆదివారం (అగష్టు 9, 2020) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని మహేశ్ కోరారు. ప్లాస్మా దానంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేపడుతున్న అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ప్లాస్మా దానంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ, పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోందన్నారు.

Related Posts