a wild lioness is seen nursing a baby leopard

అమ్మప్రేమ : చిరుత కూనకు పాలిస్తున్న సింహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిరుతపిల్లకు పాలిచ్చి పెంచుతున్న సింహం : జాతి వైరం ఉన్న ఓ చిరుత పిల్లను తన పిల్లగా భావించిన ఓ ఆడసింగం తీరు అటవీ అధికారులతో పాటు నెటిజన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో వున్న ఆడ సింహం  తన రెండు పిల్లలతో పాటు  నెలన్నర వయసున్న ఓ చిరుత పిల్లను కూడా ఆడసింహం పాలిస్తు పెంచటాన్ని అటవీ అధికారులు గుర్తించారు.

గుజరాత్‌ : అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అది మనుషులకైనా..జంతువులకైనా..ఆఖరికి క్రూర మృగాలకైనా అమ్మ అమ్మే. అమ్మతనానికి అద్ధంపట్టేలా కనిపించిన ఈ అరుదైన..అద్భుత సీన్ కు ఫిదా అయిపోనివారుంటారా..అమ్మ ప్రేమలో ఎలాంటి కల్మషం ఉండదు. తాజాగా తన ఆకలి తీర్చుకునేందుకు జంతువులను వేటాడి తినే క్రూర మృగాలు సైతం అమ్మతనం ఎంత గొప్పదో చాటి చెప్పాయి. జాతి వైరం ఉన్న ఓ చిరుత పిల్లను తన పిల్లగా భావించిన ఓ ఆడసింగం తీరు అటవీ అధికారులతో పాటు నెటిజన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. గుజరాత్‌లోని గిర్ అడవుల్లో వున్న ఆడ సింహం  తన రెండు పిల్లలతో పాటు  నెలన్నర వయసున్న ఓ చిరుత పిల్లను కూడా ఆడసింహం పాలిస్తు పెంచటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ఆ చిరుత పిల్ల ఆకలి తీర్చడంతో పాటు ఇతర సింహాలు చిరుత పిల్లను చంపకుండా ఆడ సింహం కాపాడుతోందని గిర్ పశ్చిమ డివిజన్ ఫారెస్ట్ అధికారి ధీరజ్ మిట్టల్ తెలిపారు.

ఈ అరుదైన సీన్ ను షూట్ చేసిన ఫారెస్ట్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  చిన్ని చిరుత పిల్ల విషయంలో ఆడ సింహం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోందనీ..దానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతోందని..అంతేకాదు సింహం పిల్లలతో కలిసి చిన్నారి చిరుత ఆడుకోవడం..చిరుత పిల్ల ఆడ సింహం ఇచ్చే సిగ్నల్స్ ను ఫాలో కావటం..శబ్దాలను పసిగడుతోందని  అటవీశాఖ అధికారులు తెలిపారు. అమ్మతనం అంటే అదే కదా..ఏజాతి అయినా..ఏ పుట్టుక అయినా అమ్మతనంలో ఎటువంటి కల్మషం..బేషజం వుండదు. అందుకే అమ్మ సృష్టిలో తీయనిది..అరుదైనా..అద్భుతమైనది. దేవుడు అన్నిచోట్ల వుండలేక అమ్మను ఇచ్చాడనే మాట ఎంత నిజమో కదా..

 

Related Posts