లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

ఫైజర్ కరోనా టీకాతో తీవ్రమైన ‘హ్యాంగ్ ఓవర్’ లక్షణాలు

Published

on

Pfizer Covid vaccine : ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి వాలంటీర్లలో తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తాయి. దాదాపు 43,500 మంది ఫైజర్ ప్రయోగాత్మక వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఇతర ఫ్లూ వ్యాక్సిన్లతో పోలిస్తే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఒక్కసారిగా తలనొప్పి, కండరాల నొప్పులు వంటి దుష్ర్పభావాలు కనిపించాయని వాలంటీర్లు చెప్పుకొచ్చారు.కరోనా క్లినికల్ ట్రయల్స్ అనంతరం ఫైజర్ తమ వ్యాక్సిన్ కరోనాపై 90శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని రివీల్ చేసిన తర్వాత చాలామందిలో వాలంటీర్లలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.

టెక్సస్‌కు చెందిన Glenn Deshields అనే ట్రయల్ వాలంటీర్.. తీవ్రమైన హాంగ్ ఓవర్ లాంటి దుష్ప్రభవాలు అనుభవించినట్టు తెలిపారు. కాకపోతే కొంతసేపటికి ఆయా లక్షణాలు తగ్గిపోయాయని అన్నారు.

మిస్సోరికి చెందిన 45ఏళ్ల మరో వాలంటీర్ Carrie గత సెప్టెంబర్ నెలలో ఫస్ట్ షాట్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటినుంచి తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలను కనిపించాయని తెలిపారు.

ఏదైనా ఫ్లూ టీకా వేసిన వెంటనే కనిపించే దుష్ప్రభవాల మాదిరిగా ఉన్నాయని తెలిపింది. గత నెలలో కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించాయని ఆమె తెలిపింది.

వాస్తవానికి.. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లలో తమకు వేసింది వ్యాక్సిన్ లేదా ప్లేసిబో అని తెలియకుండానే వేయించుకున్నారు.

కానీ, కెర్రీ అనే వాలంటీర్‌ కరోనా టీకా వేయించుకోగా.. దాని కారణంగానే తనలో దుష్ప్రభవాలు కనిపించాయని భావించారు. Deshields అనే మరో వాలంటీర్ కూడా హాంగ్ ఓవర్ లక్షణాలను అనుభవించారు.అయితే తాను వేయించుకుంది కరోనా వ్యాక్సిన్ అవునో కాదో తెలుసుకునేందుకు తన డాక్టర్‌తో యాంటీబాడీ టెస్టింగ్ చేయించుకున్నారు. అతడికి పాజిటివ్ అని తేలింది.

దాంతో తనకు ప్లేసిబో ఇవ్వలేదని నిర్ధారించుకున్నారు. తనలో సొంత రోగ నిరోధక స్పందన కారణంగా వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ తనలో తీవ్రమైన దుష్ప్రభవాలు కనిపించలేదన్నాడు. జార్జియాలోని రోమ్ నగరానికి చెందిన బ్రయాన్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ, తాను తీసుకుంది ప్లేసిబో అనుకున్నాడు.

తనకు రెండు షాట్ వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కూడా తనలో ఎలాంటి రోగనిరోధక స్పందన లేదని భావించాడు. గత నెలలో ఇతడి కుటుంబమంతా కరోనా బారిన పడి కొన్ని రోజులకు కోలుకున్నారు.ఫైజర్, తన వ్యాక్సిన్ భాగస్వామి బయోంటెక్ సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ 90 శాతానికి కంటే సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించాయి.

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ బ్రిటన్లు తీసుకుంటున్నారని హెల్త్ సెక్రటరీ మ్యాట్ హ్యాన్ కాక్ రివీల్ చేశారు. యూకే మెడిసిన్స్ రెగ్యులేటర్ లైసెన్స్ మరొకొన్ని రోజుల్లో ఆమోదం పొందనుంది.

మిలటరీ, NHS సిబ్బందికి డిసెంబర్ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అవుతుందని హ్యాన్ కాక్ తెలిపారు. వారంలో ఏడు రోజులు ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు.

ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ఎంతవరకు సురక్షితమనేది ట్రయల్స్ డేటా ఆధారంగానే రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభించనుంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే క్రిస్మస్ నాటికి ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.ఈ వ్యాక్సినేషన్ క్లినికులు బ్యాంక్ హాలీడేస్, వీకెండ్లలోనూ తెరిచే ఉంటాయని హ్యాన్ కాక్ చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ కంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పంపిణీ చేయడం చాలా సులభమమని HanCock అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 70C మైనస్ డిగ్రీల ఉష్గోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉంటుంది.బెల్జియంలో ఫైజర్ టీకా తయారువుతోంది.. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే పంపిణీకి సంబంధించి శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. ఫైజర్ ఫుల్ సేఫ్టీ డేటా ఆధారంగానే వ్యాక్సిన్ కు ఆమోదం లభించే అవకాశం ఉందని హ్యాన్ కాక్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ప్రపంచమంతా 200కు పైగా కరోనా వ్యాక్సిన్లు టెస్టింగ్ లో ఉండగా.. 40 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *