Narthanasala: అర్జునుడిగా బాలయ్య!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Narthanasala FirstLook: సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలలో తండ్రికి ధీటైన తనయుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటవారసుడిగా ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న నటసింహ బాలకృష్ణ నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన Mythological Epic ‘‘నర్తనశాల’’..

మంగళవారం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అర్జునుడిగా బాలయ్య లుక్ ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్ తరువాతి జనరేషన్‌లో ఇటువంటి పాత్రలు చేయాలంటే ఒక్క బాలయ్యకే సాధ్యం అని కొత్తగా చెప్పనవసరం లేదు.సౌందర్య ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన దాదాపు 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకులు, అభిమానులు వీక్షించడానికి వీలుగా విజయదశమి సందర్భంగా NBK Theatre లో శ్రేయాస్ ఈటి ద్వారా అక్టోబర్ 24న విడుదల చేయబోతున్నారు.


ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌‌కి ఉపయోగించడానికి నందమూరి బాలకృష్ణ సంకల్పించారు. ఎన్నాళ్ళగానో ‘నర్తనశాల’ కోసం రూపొందించిన సన్నివేశాలను చూడాలన్న కోరిక ఈ నెల 24 నెరవేరబోతోండటంతో నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Narthanasala FirstLook

Related Tags :

Related Posts :