Fish 'with a HUMAN FACE' is spotted swimming in a pond at a village in China

షాకింగ్ వీడియో : భయాందోళనకు గురి చేస్తున్న చేప

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్

చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్ కావడానికి కారణం లేకపోలేదు. ఆ చేప ముఖం అచ్చం మనిషి ముఖాన్ని పోలినట్టు ఉండటమే.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని మియో గ్రామానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి నీటి ప్రవాహంలో ఈ చేప కనిపించినట్టు న్యూస్ పేపర్లలో వార్తలు వచ్చాయి. నీళ్లలో చేప వస్తున్న వీడియోను తీసిన మహిళ వెంటనే చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేసింది. దీంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయ్యింది. 

నీటిలో ఈదుకుంటూ వస్తున్న చేప ముందు భాగం మనిషి ముఖాన్ని పోలినట్లుగా ఉంది. మనిషి తరహాలోనే ఆ చేపకు కళ్లు, ముక్కు, నోరు ఉన్నాయి. ఈ చేపను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియోను మిలియన్ల మంది చూశారు. ఇది నిజంగా భయానకం అని ఒకరు.. ఈ చేపను తినడానికి ఎవరికైనా ధైర్యముందా అని మరొకరు.. ఇలా రకరకాల మెంట్స్ చేస్తున్నారు. ఏలియన్ చేప అని కూడా కొందరు చెబుతుననారు. మొత్తానికి వింతగా కనిపిస్తున్న ఈ చేప సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Related Posts