లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

పశ్చిమ బెంగాల్ లో పేలుడు… ఐదుగురు మృతి

Published

on

Five dead, four Critically injured in an explosion inside a factory :  పశ్చిమ బెంగాల్ లో ఈ రోజు భారీ పేలుడుసంభవించింది. మల్డా జిల్లాలోని సుజాపూర్ పారిశ్రామిక వాడలోని ఒక రీ సైక్లింగ్ కర్మాగారంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించటంతో ఐదుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులనుతక్షణమే ఆదుకోవాలని సీఎంమమతా బెనర్జీ ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారిక రూ. 2లక్షలు , గాయపడిన వారికి రూ. 50వేలు నష్టపరిహారం అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ చెప్పారు. సచివాలయం నుంచి పరిస్ధితిని ఆయన సమీక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనా స్ధలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు.నలుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. యంత్రాలలో కొంత లోపం ఉండటం వలన ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు మాల్డా పోలీసు సూపరింటెండెంట్ అలోక్ రాజోరియా చెప్పారు.

ఓరి నాయనో..! మనిషి ఎముకలు, పుర్రెలతో ఏకంగా రోడ్డు వేసేశారు..!!


ప్లాస్టిక్, ఇనుము, ఇత్తడి ని రీ సైకిల్ చేసే ఈ కర్నాగారంలో ప్రమాదం జరిగినప్పుడు 20 మంది వరకు కార్మికులు పని చేస్తున్నట్లు గుర్తించారు. పేలుడు చాలా శక్తివంతమైనదని…2 కిలోమీటర్ల వరకు దాని శబ్దం వినపడినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గోడలు కూలిపోయి, పైకప్పు ఎగిరిపోయింది. చుట్టుపక్కల ఉన్న భవనాల గోడలు దెబ్బతిన్నాయి. ఫ్యాక్టరీ యజమాని అమ్లు షేక్ కోసం పోలీసులుగాలిస్తున్నారు. కాగా… ఈ ఫ్యాక్టరీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని….కొన్నిసంఘవిద్రోహకర శక్తులు ఇక్కడ తరచూ సమావేశం అవుతున్నట్లు స్ధానికులు ఆరోపిస్తున్నారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *