pawan kalyan

పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలకు వెళ్తూ.. ఐదుగురు అభిమానులు మృతి..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Five Pawan Kalyan Fans Lost Life In Car Accident: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌డుతుండగా విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో ఒక్క‌సారిగా నిప్పులు చెల‌రేగి 10 మందికి విద్యుత్‌ఘాతం త‌గిలింది. ఈ ప్రమాదంలో సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌లం, రాజేంద్ర అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మరో ప్రమాదంలో ఐదుగురు పవన్ అభిమానులు దుర్మరణం చెందిన సంఘటన కలవరానికి గురిచేసింది.తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు కారులో పరకాలకు బయల్దేరిన ఐదుగురు స్నేహితులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద బుధవారం తెల్లవారుజామున (సెప్టెంబర్ 2) ఈ ప్రమాదం జరిగింది.

గెట్ రెడీ ఫ్యాన్స్… పవన్ ట్రిపుల్ ట్రీట్..


యువకులు ప్రయాణిస్తున్న కారును కాళేశ్వరం నుండి వరంగల్ వస్తున్న ఇసుకలారీ ఢీ కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కారును ఓవర్ టేక్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తవల్లే ఈ ప్రమాదం జరిగిందని, కారు నుజ్జునుజ్జు అవడం కారణంగా మృతదేహాలను బయటకు తీయడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని, మృతదేహాలను ఎంజీఎంకు తరలించామని, మృతులు వరంగల్ పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేష్, పవన్, ప్రవీణ్, రోహిత్, రహీమ్‌లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మృతుల తల్లులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.Related Posts