Rafale Fighter Jet: భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ అస్త్రం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాఫెల్ వచ్చేసింది. భారత్ వాయుసేనలోకి తొలి 5 రాఫెల్ యుద్ధ విమానాలు చేరాయి. హర్యానాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.



ఆయనకు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వాయుసేన అధికారులు స్వాగతం పలికారు. వాయుసేన 17 స్క్వాడ్రాన్ లో ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ భాగం. జులై 29వ తేదీన ఫ్రాన్స్ నుంచి భారత్ కు ఐదు యుద్ధ విమానాలు వచ్చాయి. అనంతరం ఆకాశంలో రాఫెల్ గర్జించింది. భీకరశబ్ధం చేస్తూ..చక్కర్లు కొట్టింది. వావ్ అనిపించే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా ఈ విమానాలు విన్యాసాలు చేశాయి. అంతకంటే ముందు..సంప్రదాయ ప్రకారం పూజలు చేశారు.

సరిహద్దులో చైనాకు తగిన సమాధానం.. దళాలు, ఆయుధాలను మోహరిస్తున్న భారత్


భారత అవసరాలకు అనుగుణంగా..స్వల్ప మార్పులు చేసింది వైమానిక దళం. 2022 నాటికి పూర్తిస్థాయిలో రాఫెల్ ఫైటర్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి భారత్ కు రానున్నాయి.



ద సాల్ట్‌ సంస్థ తయారు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాల‌ను భార‌త్ స‌మ‌కూర్చుకొంటున్న‌ది. రూ.59,000 కోట్లతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

రాఫెల్ రానంత వరకు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీక్‌గా ఉందని కాదు అర్థం. కాకపోతే.. రాఫెల్ వచ్చాక మన వైమానిక దళం.. బలం కచ్చితంగా డబుల్ అయ్యిందని మాత్రం చెప్పొచ్చు. రాఫెల్ కంటే ముందు ఇండియా దగ్గర సుఖోయ్-30MKI, మిగ్-29, మిరాజ్-2000, ఇండియన్ మేడ్ తేజస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పటివరకూ.. శత్రుదేశాల ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఇవే సమాధానం చెప్పాయి.



శత్రుదేశానికి ఏమాత్రం డౌట్ రాకుండానే ఫైట్ చేసేయొచ్చు. మన గగనతలం నుంచే.. ముష్కర స్థావరాలపై మిస్సైల్స్ ఫైర్ చేయొచ్చు. బోర్డర్ దాటకుండానే ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు. చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయ ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది.

శత్రుదేశం భూభాగంలోకి ప్రవేశించకుండానే.. అవతలి వైపు సుదూర ప్రాంతాల్లో.. దాడి చేయగల అస్త్రాలు రాఫెల్ దగ్గరుంటాయి. మెరుపువేగంతో దూసుకెళ్లే.. ఈ మిస్సైల్స్ నుంచి తప్పించుకోవడానికి.. ప్రత్యర్థికి చాన్సే లేదు. ఇవి.. అత్యంత కచ్చితత్వంతో దాడి చేస్తాయి.



రాఫెల్ యుద్ధ విమానాలతో పాటే.. ఇవి భారత్‌కు అందుతున్నాయి. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్లు ఫినిష్ చేయడానికి.. ఇందులో మీటియోర్ మిస్సైల్ ఉంటుంది. ఇది.. రాకెట్ రామ్‌జెట్ మోటార్‌తో పనిచేస్తుంది. అందువల్ల.. దీని కెపాసిటీ చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పని చేస్తుంది.

READ  జోరువానలోనూ డ్యూటీ : ట్రాఫిక్ పోలీస్ అంకితభావం

మీటియోర్ మిస్సైల్.. 150 కిలోమీటర్ల దూరంలోని శత్రుదేశాల యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైల్స్‌ని ఫినిష్ చేసేస్తుంది. మన విమానం ఉనికిని.. శత్రుదేశం ఫైటర్ జెట్ కనిపెట్టే లోపే.. రాఫెల్ దానికి ఎండ్ కార్డ్ వేసేస్తుంది.
రాఫెల్‌లో స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైల్ ఉంటుంది. ఇది.. 3 వందల కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది.



ఎయిర్‌లో.. రాఫెల్‌కి దగ్గర్లో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చేందుకు.. మైకా మిస్సైల్ ఉంటుంది. దీని కెపాసిటీ 80 కిలోమీటర్లు. సైలెంట్ కిల్లర్‌గా మైకాను పిలుస్తారు. రాఫెల్‌లో హ్యామర్ మిస్సైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది.. 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు.

స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ సిస్టమ్.. రాఫెల్ ఎక్స్‌ట్రా ఫీచర్. ఇది.. శత్రుదేశాల రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో.. రాఫెల్ ఉనికిని దాచిపెడుతుంది. ఇందులో.. శక్తిమంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు, 360 డిగ్రీల్లోనూ శత్రు మిస్సైల్స్ రాకను పసిగట్టి.. పైలట్‌ని హెచ్చరించే సిస్టమ్స్ ఉన్నాయి. శత్రు దేశాల రాడార్లు, మిస్సైల్స్‌ని బోల్తా కొట్టించే ఫ్లేర్ అండ్ షాఫ్ డిస్పెన్సర్లు, టోడ్ డెకాయ్ సిస్టమ్ రాఫెల్‌లో ఉన్నాయి.



వీటన్నింటి వల్ల.. రాఫెల్ ప్రత్యర్థిపై దాడి చేసి.. అజేయంగా తిరిగి రాగలదు. రాఫెల్ కాక్‌పీట్ కూడా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఇందులో.. హోలోగ్రఫిక్ కాక్‌పీట్ డిస్‌ప్లే సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. ఫైటర్ జెట్ కంట్రోలింగ్, మిషన్ డేటా నిర్వహణ, మిస్సైల్స్ ఫైరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. పైలట్‌ తన తలను కిందకు దించాల్సిన అవసరం లేకుండానే.. కీలక సమాచారాన్ని అందించే హెడ్ అప్ డిస్‌ప్లై సిస్టమ్ ఇందులో ఉంది.

గాల్లోనే ఇంధనం నింపుకోవడం రాఫెల్‌కు ఉన్న మరో స్పెషాలిటీ. అవసరమైతే.. సహచర ఫైటర్ జెట్స్‌కి కూడా ఇది ఇంధనాన్ని నింపగలదు. దీని రెక్కలు కూడా డెల్టా ఆకృతిలో ఉంటాయ్. అందువల్ల.. ఇది చాలా మెరుగ్గా విన్యాసాలు చేస్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్‌లోనూ.. స్థిరంగా ఉంటుంది.

Related Posts