Home » హైదరాబాద్‌లో శాశ్వతంగా మూతపడనున్న ఐదు థియేటర్లు ఇవే
Published
2 months agoon
By
sekharFive Single Screen Theatres Closed: లాక్డౌన్ కారణంగా దాదాపు 8 నెలలపాటు థియేటర్లు తెరుచుకోలేదు. అన్‌లాక్ 5.O నేపథ్యంలో కొన్ని నిబంధనలతో థియేటర్లు తెరుచుకోవచ్చని, మినిమం కరెంట్ చార్జీలు చెల్లించనవసరం లేదని ఇటీవల సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే.
మరికొద్ది రోజుల్లో సినిమా హాళ్లు ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ నగరంలో ఐదు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం శాశ్వతంగా మూతపడనున్నాయి.
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని శ్రీ మయూరి, నారాయణగూడ శాంతి థియేటర్, బహదుర్ పుర శ్రీ రామ, టోలిచౌకి గెలాక్సీ, మెహదీపట్నం అంబ థియేటర్లు శాశ్వతంగా మూతపడనున్నాయి. శాంతి థియేటర్‌ను గోడౌన్‌గా మార్చనున్నారు. అంబ థియేటర్‌కు కొన్ని పర్మిషన్స్ పెండింగ్‌లో ఉన్నాయి కానీ క్లోజ్ చేయడం దాదాపు ఖరారు అయినట్లే.
మూత పడనున్న ఈ సినిమా హాళ్లతో నగరవాసులకు, సినీ పరిశ్రమ వారికి, సినీ ప్రియులు మరియు అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి.
ఎన్నో గొప్ప సినిమాలు ప్రదర్శించి, ఘనమైన చరిత్ర కలిగిన ఈ థియేటర్లు మూసి వేయడం పట్ల సినీ ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.