Home » ఫ్లాష్ న్యూస్ : హైదరాబాద్ మెట్రోలో మరో ప్రమాదం
Published
1 year agoon
By
madhuహైదరాబాద్ మెట్రో స్టేషన్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ పైపు ఊడిపడింది. మెట్రో స్టేషన్ పైనుంచి ప్లాస్టిక్ పైప్ ఊడిపడింది. అయితే.. పైప్ పడిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో… ప్రమాదం తప్పింది.
నగరంలో మెట్రో సమస్యలు తగ్గడం లేదు. రెండు రోజుల క్రితం కూడా మెట్రో ట్రైన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ కంపార్ట్మెంట్లోని పై బాగం ఊడి ప్రయాణికులపై పడింది. ఈ సంఘటన ఎల్బీనగర్ మియాపూర్ మార్గంలో ఉన్న ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో జరిగింది. దీని వల్ల ఎలాంటీ ప్రమాదం జరగకున్నా… కంపార్ట్మెంట్ పై భాగం ఊడిపోడంతో రైలు ప్రయాణికులు ఆందోళన చెందారు.
మరోవైపు.. కొన్ని రోజుల క్రితం అమిర్పేట్లోని మెట్రో స్టేషన్లో నిర్మాణం కూలి వివాహిత మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో… ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. తనిఖీలు నిర్వహించిన అధికారులు కొన్ని లోపాలను గుర్తించి వాటిని సరిచేసే ప్రయత్నం చేశారు. అయితే మెట్రో నిర్మాణంలోని భాగాలు ఊడిపడడం మరింత ఆందోళన కల్గిస్తోంది. అత్యంత నమ్మకంగా ప్రయాణికులను గమ్యానికి చేర్చాల్సిన మెట్రో ఇలా ప్రమాదాలకు నిలయాలు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
అంతేగాకుండా..ఓ మెట్రో స్టేషన్ పిల్లర్‌కు పగుళ్లు వచ్చాయి. సమస్యలు అక్కడక్కడ పునరావృతమౌతు అవుతుండడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో రద్దీ పెరుగుతోంది. మరి..ప్రమాదాలు జరుగకుండా మెట్రో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Read More : మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది : ఎన్వీఎస్ రెడ్డి