లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

యూకే హీత్రూ ఎయిర్‌పోర్టులో నరకం చూస్తున్న తెలుగు విద్యార్థులు

యూకే హీత్రూ ఎయిర్‌పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.

Published

on

Flights canceled, trobles to Telugu states students at Heathrow Airport in UK

యూకే హీత్రూ ఎయిర్‌పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.

యూకే హీత్రూ ఎయిర్‌పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు. అయితే విద్యార్థులకు మొదటి నాలుగు రోజులు వసతి, ఆహారం అందజేసిన ఇండియన్ ఎంబసీ అధికారులు తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఆహారం, వసతి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎంపీలకు ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్.. వెనక్కి వెళ్లలేక, ఎయిర్ పోర్టులోకి రానివ్వకపోవడంతో.. రోడ్లపైనే గడుపుతున్నారు. కనీసం తమకు షెల్టర్ అయినా ఇప్పించాలని కోరుకుంటున్నారు. 

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు. మృతులంతా ఈనెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడే వీరికి కరోనా వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. అయితే వీరంతా తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోయారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న ఇద్దరు గాంధీలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. 

మరొకరు అపోలో ఆస్పత్రిలో, ఇంకొకరు గ్లోబల్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అంతేకాదు.. నిజామాబాద్‌, గద్వాలలోనూ ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే వీరందరూ… కరోనా సోకిందని తెలియకముందే చనిపోయారు. మూడు రోజుల క్రితం ఖైరతాబాద్‌లో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఖైరతాబాద్‌ వృద్ధుడికి కూడా చనిపోయే ముందు కరోనా ఉన్నట్టు తెలియలేదు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. మిగతా వారు కూడా అదే రీతిలో చనిపోయినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరో రెండు కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. కాకినాడలో 49 ఏళ్ల వ్యక్తికి, రాజమహేంద్రవరంలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో నెల్లూరు, విశాఖ నుంచి ఒకొక్కరు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.   

దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. దేవ్యాప్తంగా గడిచిన 24 గంట‌ల్లో 92 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరిన‌ట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని సూచించారు లవ్‌ అగర్వాల్‌. ప్రతి ఒక్కరికి ఆహారం అందేలా చూడాలన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

దేశ‌వ్యాప్తంగా ఇప్పటి వ‌ర‌కు 38 వేల 442 కేసుల‌కు ల్యాబ్ ప‌రీక్షలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.నిన్న ఒక్కరోజే 3 వేల 501 మందికి టెస్ట్ లు చేశామన్నారు. ప్రైవేటు ల్యాబ్‌ల్లో గ‌త మూడు రోజుల్లో 1334 ప‌రీక్షలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని..సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలిన సూచించారు. ఎక్కడి వారు అక్కడే ఉండి కరోనా కట్టడికి సహకరించాలన్నారు. 
 

Also Read | కరోనా ఎఫెక్ట్‌ : ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో భారీ కోత…సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *