లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ : టాప్ 5 స్మార్ట్ ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్!

Published

on

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ 2021 ఫస్ట్ డే సేల్ ప్రకటించింది. జనవరి 20 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. జనవరి 24 వరకు ఈ ఫస్ట్ డే సేల్ కొనసాగనుంది. ఫ్లిప్  కార్ట్ ప్లస్ యూజర్లు మాత్రం జనవరి 19 నుంచే ఈ డీల్ సేల్ యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఫ్లిప్ కార్ట్ అందించే గ్రేట్ డీల్స్ మిస్ కావద్దు.

ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేసే స్మార్ట్ ఫోన్ డీల్స్ లో టాప్ 5 స్మార్ట్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకుని సేల్స్ స్టార్ట్ కాగానే వెంటనే కొనేసుకోండి. ఇంతకీ స్మార్ట్ ఫోన్ల డీల్స్ లో ఏయే బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..
Moto G 5G :
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో భాగంగా.. మోటోజీ G 5G మోడల్ స్మార్ట్ ఫోన్ రూ.2వేల డిస్కౌంట్‌తో వస్తోంది. 5G సపోర్ట్ చేసే ఈ మోడల్ ఫోన్ డిస్కౌంట్ ధరతో రూ.18,999లకే అందుబాటులో ఉంటుంది. ప్రధాన ఆకర్షణగా స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్‌సెట్, 5000mAh గ్రేట్ బ్యాటరీ లైఫ్‌ అందిస్తోంది.
Samsung Galaxy S20 Plus :
శాంసంగ్ గెలాక్సీ S20ప్లస్ మోడల్ ఫోన్.. డిస్కౌంట్ ధరతో వస్తోంది. అసలు ధర రూ.54,999లు ఉండగా.. తగ్గింపు ధరతో రూ.44,999లకే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ S20 ప్లస్ మోడల్ ఫోన్ లో 120Hz AMOLED డిస్‌ప్లేతో అందిస్తోంది.

Asus ROG Phone 3 :
మొబైల్ గేమింగ్ డివైజ్‌ల్లో ROG Phone 3 స్మార్ట్ ఫోన్ ఒకటి. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌లో దీని ధర రూ.43,999లకే ఆఫర్ చేస్తోంది. ROG ఫోన్.. 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లోకి వచ్చింది. డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవాలంటే బిగ్ సేల్ కు రెడీగా ఉండండి.
LG Wing :
ఎల్ జీ కంపెనీ అందించే మోడల్ ఫోన్లలో ఇదొకటి.. LG Wing.. ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. హైఎండ్ ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ తగ్గింపు ధరతో రూ.64,990లకే సొంతం చేసుకోవచ్చు. అట్రాక్టివ్ డిస్‌ప్లే, రియర్ కెమెరా సిస్టమ్, గ్లింబల్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్లోకి వచ్చింది.
IQOO 3 :
వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి వచ్చిన కొన్ని కొత్త మోడల్ ఫోన్లలో ఇదొకటి.. IQOO3 ఫోన్.. గత ఏడాదిలోనే స్నాప్ డ్రాగన్ 865 చిప్ సెట్ తో మార్కెట్లోకి వచ్చింది. ప్రత్యేకించి మొబైల్ గేమర్ల కోసం ఈ మోడల్ గుడ్ డీల్ అని చెప్పొచ్చు. దీని ధర బిగ్ డే సేల్ లో రూ. 34,990లకే లభ్యం కానుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *