వరద సహాయం : మీ సేవాలో రూ. 45 మాత్రమే చెల్లించాలి, మీసేవా కేంద్రాల వద్ద మహిళలు క్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Flood Assistance : వరదలే కాదు….వరద సహాయం కోసం కూడా మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం అందించే పదివేల రూపాయల కోసం మీసేవా కేంద్రాల వద్ద మహిళలు క్యూ కట్టారు. ఇదే అదనుగా మీసేవ సెంటర్లలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు.మీసేవా సెంటర్ల వద్ద ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 45 రూపాయలకు మించి వసూలు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. మీ సేవా కేంద్రాల వద్ద 45 రూపాయలు మాత్రమే చెల్లించాలంటూ పోస్టర్లు వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు నీట మునగడంతో జనం అనేక ఇబ్బందులు పడ్డారు. ఇపుడు వరదసాయం అందుకోవడానికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.వరద భాదితులకు ప్రభుత్వం అందిస్తున్న.. 10వేల రూపాయల కోసం మహిళలు, వృద్థులు, చిన్నారులతో పాటు మీసేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. హైదరాబాద్‌లో వరద సాయం అందని బాధితులు మీసేవా వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో బాధితులు నగరంలోని మీసేవా కేంద్రాల ముందు ప్రభుత్వ సాయం నమోదు కోసం బారులు తీరారు. పేరు నమోదు కోసం గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి. ఇదే అదనుగా కొన్ని మీసేవా సెంటర్లలో.. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివరాల నమోదు కోససం 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు.ప్రభుత్వం వరద బాధితులకు సాయం పేరుతో.. గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్దిపొందడానికే 10వేల రూపాయలు ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఉదయం నుంచి మీసేవా సెంటర్ల ముందు మహిళలు క్యూ కట్టారన్న ఆయన.. మహిళలకు కరోనా సోకితే మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తారా అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Tags :

Related Posts :