వామ్మో.. జనాల్లో స్వేచ్ఛగా తిరుగేస్తున్న భారీ మెుసలి… Viral video

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

In Florida a huge crocodile found video viral :
మెుసలిని చూస్తే చాలు భయపడిపోతాయం. నీళ్లల్లోకి దిగేముందు ఆ ప్రాంతంలో మెసళ్లు ఉన్నాయోమోనని తెలుసుకుంటాం.లేదంటే అంతే సంగతులు…తెలీకుండా నీటిలోకి దిగామా..మనల్ని గుటుక్కుమనిపించేస్తుంది. మొసళ్లు నీళ్లలోనే ఎక్కువగా ఉంటాయి. వాటికి అక్కడే సేఫ్టీ. కానీ అవి గట్టుమీదికొస్తే ప్రమాదమే వాటికి. కానీ యూఎస్ లోని ఫ్లోరిడాలో ఓ భారీ మొసలు స్వేచ్చగా జనాల్లో తిరిగేస్తోంది. గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో ఓ భారీ మెుసలి స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించింది. దీంతో అక్కడే ఉన్న పిజిఎ ప్రొఫెషనల్ జెఫ్ జోన్స్ ఆ దృశ్యాన్ని వీడియో తీసేశారు.  ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లో వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలోని నేపుల్స్లో ఉన్న వాలెన్సియా గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ లో ఓ అరుదైన మెుసలి కనిపించి కంగారు పెట్టేసింది. ఆ చుట్టు ప్రక్కనే ఉన్న నదులు, సరస్సుల ఉండటంతో వాటిల్లో ఉండే మొసళ్లు తరచూ గోల్ఫ్ కోర్టుల్లోకి వచ్చేస్తుంటాయి. అయితే, జెఫ్ జోన్స్ తీసిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కాకముందే, వింక్ న్యూస్ వాతావరణ శాస్త్రవేత్త మాట్ డెవిట్ మెుసలికి సంబంధించిన ఫోటోలను ట్వీట్టర్ లో షేర్ చేశాడు. కానీ, చాలామంది ఇవి నకిలీ ఫోటోలు, వీడియోలన్ని భావించారు. ఎందుకంటే మెుసలి కాళ్లు చాలా పొడవుగా కనిపించటమే కారణమని నెటిజన్లు భావించటానికి కారణమని చెప్పవచ్చు.6 నెలల చికిత్స తర్వాత మళ్లీ దర్జాగా నిల్చున్న 700ఏళ్ల చరిత్ర గల పిల్లలమర్రి


సెయింట్ అగస్టిన్ ఎలిగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ జాన్ బ్రూగ్గెన్ మాట్లాడుతూ… చాలా మంది ప్రజలు మెుసలి నడకను చూసి ఉండరు. కాబట్టి వారు దీనిని నకిలీ వీడియోని భ్రమపడుతున్నారు. కానీ ఇటువంటి మెుసళ్లు అరుదుగా కనిపిస్తుంటాయి. ఇవి 9నుంచి 10 అడుగులు ఎత్తు ఉంటాయి. అంతేకాదు, వాటి కాళ్ల 1 నుంచి 2 అడుగుల పొడవు మాత్రమే ఉంటాయి అని వెల్లడించారు. మనం ఇటువంటి మెుసళ్లను ఎప్పుడు చూసి ఉండం, కనుక ఇది ఫేక్ వీడియోగా భావిస్తున్నారు. అంతేకాదు, ఈ మెుసలి అక్కడి షికారు చేయటానికి వచ్చిందని ఆయన అన్నారు.ఫ్లోరిడాలోని నేపుల్స్లో ఉన్న వాలెన్సియా గోల్స్ అండ్ కంట్రీ క్లబ్లో మెుసలిని వీడియో తీసిన మరో పిజిఎ ప్రొఫెషనల్ టైలర్ స్టోల్టింగ్ మయామి మాట్లాడుతూ మెుసలిని మధ్యాహ్నం 2 గంటల సమయంలో కనిపించింది. ఆ వెంటనే నా కెమెరాలో బంధించేశానని చెప్పాడు. కానీ కొద్ది సేపటి తర్వాత తాను తిరిగి వచ్చి చూసే సరికి మెుసలి కనిపించలేదని ఆయన తెలిపారు.

Related Tags :

Related Posts :