లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మున్ముందు మరింత ప్రమాదకరంగా మారుతున్న కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ 

Published

on

Florida Researchers Say Coronavirus Becoming More Infectious in Mutant Form

ఫ్లోరిడాలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు కరోనావైరస్ గురించి షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. 2019లో చూపించిన ప్రభావం కంటే మున్ముందు మరింత ప్రమాదకరంగా మారబోతున్నట్లు చెప్పారు. స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టీం వెల్లడించిన కథనంలో సంచలన విషయాలు చెప్పింది. 

‘మా స్టడీ ప్రకారం.. వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యే సెల్స్ ఇంకా ప్రభావవంతంగా ఉండడంతో పాటు కణాల వ్యవస్థలో మార్పులు రానున్నాయి. స్పైక్ ప్రొటీన్ ను స్టెబిలైజ్ చేయడంతో పాటు వైరస్ లో స్పైక్ ప్రొటీన్ల సంఖ్యను పెంచనున్నాయి. మరో జర్నల్ లో మైకేల్ ఫర్జాన్ అనే విశ్లేషకులు ప్రపంచవ్యాప్తంగా జీన్స్ పరంగా బలహీనతలను విస్మరించి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి చూస్తున్నాయని తెలిపింది. 

‘పని సమయంలో వైరస్ ను ఎలా అదుపుచేయాలి. ఎలా తగ్గేలా చేయాలని’ స్టడీ చేసినట్లు రాసుకొచ్చారు. వైరస్ అనేది సెలక్షన్ ప్రెజర్ కు అనుగుణంగా దానంతట అదే మరింత బలంగా మారుతూ వస్తుందని అంటున్నారు. మనిషి నుంచి వేరొకరికి మారుతున్నప్పటికీ వైరస్ తీవ్రత అనేది అలానే ఉంటుందని ఏ మాత్రం బలహీనపడటం లేదని గుర్తించారు. 

కొద్ది వారాలుగా కేసులు పెరిగి ఆకాశాన్ని తాకుతుంటే ఫ్లోరిడి డిపార్టెమెంట్ వైరస్ పై దృష్టి సారించింది. ప్రతి ప్రాంతంలోనూ వైరస్ మెజారిటీగా వ్యవహరించి మనుషులను కుంగదీస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నిబంధనలు వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయని భావించారు. తగ్గడం మాట అటుంచి లాక్‌డౌన్‌ను ఎత్తేసేసరికి కేసులు భారీ మొత్తంలో నమోదై భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా కరోనా ప్రబలడంతో ప్రజలు దూరంగా ఉండటం మానేసి సంరక్షణలో పడ్డారు. ఇది ఇలా కొనసాగకపోతే వైరస్ ఇన్ఫెక్షన్ మరింత పెరిగిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *