లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

బ్యాంకు అకౌంట్లతో ఆధార్ లింకింగ్… డైడ్ లైన్ ఫిక్స్

Published

on

Aadhaar linking deadline : కస్టమర్ల బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం(నవంబర్ 10, 2020) న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం ఆమె మార్చి 31, 2021ని డైడ్ లైన్ గా విధించారు. ఈ డైడ్ లైన్ లోగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నిరకాల బ్యాంకులు తమ కస్టమర్ల ఖాతాలకు ఆధార్ తో లింక్ చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 73 వ వార్షిక సాధారణ సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకింగ్ తోపాటు డిజిటల్ చెల్లింపులు, రూపే కార్డుల జారీ అంశాల గురించి వెల్లడించారు.వీలైతే డిసెంబర్ నెల చివరి నాటికే ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతాల లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, కుదరకపోతే వచ్చే ఏడాది మార్చి 31, 2021 తేదీలోగా కచ్చితంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్ని చెప్పింది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత ఆధార్ తో అనుసంధానం కానీ ఖాతాలు, ఇంకా మిగిలి ఉన్నాయనే మాట వినపడదు అనే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. అలాగే అవసరం అనుకుంటే పాన్ కార్డును బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేయాలని తెలిపింది.ఎస్వీబీసీ‌లో పోర్న్ సైట్ కలకలం, శతమానం భవతి వీడియో లింక్ బదులుగా పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగి


అంతేకాకుండా నిర్మలా సీతారామన్ బ్యాంకులకు మరో విషయాన్ని కూడా సూచించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాలని చెప్పారు. ఎవరికైనా కార్డు ఇవ్వాలంటే రూపే కార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తెలిపారు. రూపే కార్డులను ప్రోత్సాహించాలన్నారు. దీంతో ప్రతీ ఒక్క భారతీయుడు రూపే కార్డు కలిగి ఉండేలా చూడాలన్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌‌ను ఒక ఇండియన్ బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. కస్టమర్లకు కార్డు జారీ చేసేటప్పుడు బ్యాంకుల మెుదటి ఆప్షన్ గా రూపే కార్డు అయ్యి ఉండాలని ఆమె పేర్కొంది.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *