గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న FMCG కంపెనీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్ డౌన్ సడలింపు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్లు ఎఫ్‌ఎంసిజి దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి. ఏప్రిల్- జూన్ మధ్య దాదాపు 30 నుండి 45 రోజుల అమ్మకాల నష్టం ఉండగా… పట్టణ డిమాండ్‌ను అధిగమిస్తూ రురల్(గ్రామీణ)డిమాండ్ మరింత స్థిరంగా ఉండటాన్ని కంపెనీలు చూశాయి.

గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు వేగంగా కోలుకుంటున్నట్లు FMCG కంపెనీలు తెలిపాయి. మొత్తంమీద, ఎఫ్‌ఎంసిజి విభాగం వచ్చే తొమ్మిది నెలల్లో 5 శాతం వృద్ధి చెందుతుందని, అయితే గ్రామీణ వృద్ధి పట్టణంతో పోలిస్తే రెండు రెట్లు పెరుగుతుందని వ్వ్యాపార వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఎంసిజి ఖర్చులో రూరల్ మార్కెట్లు 36 శాతానికి పైగా ఉన్నాయి.

పట్టణ మార్కెట్ అమ్మకాలు 70 శాతానికి తక్కువగా ఉన్నాయని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ ఇటీవలి నివేదికలో నీల్సన్ డేటాను ఉటంకిస్తూ తెలిపింది.

మే నెలలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ వృద్ధి కరోనా రాకముందు స్థాయిలా( pre-Covid levels) 85 శాతానికి చేరుకోగా, పట్టణ మార్కెట్ అమ్మకాలు 70 శాతానికి తక్కువగా ఉన్నాయని ల్సన్ డేటాను ఉటంకిస్తూ ఎడెల్వీస్ సెక్యూరిటీస్ ఇటీవల ఓ రిపోర్ట్ లో తెలిపింది. అధిక వ్యవసాయ ఆదాయాలు, లాక్ డౌన్ సమయంలో కనీస రిటైల్ అంతరాయం, ఇంటికి తిరిగి వచ్చే వలస కార్మికులు, మంచి వర్షాకాలం మరియు బంపర్ రబీ పంట ఈ పెరుగుదలకు కారణమయ్యాయి.

మార్చి తరువాత గ్రామీణ డిమాండ్లో సాధారణ మంచి వృద్ధిని మేము చూస్తున్నాము, ఇది గత సంవత్సరంతో సమానంగా ఉంది. ఈ సంవత్సరం రెండంకెలలో మరింత మంచి వృద్ధిని ఆశిస్తున్నాం అని ఇమామి లిమిటెడ్ డైరెక్టర్ హర్ష వి అగర్వాల్ చెప్పారు.

Related Posts