లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

జీడిపప్పు, బాదం, గుడ్లు.. ఏపీలో కరోనా బాధితుల ఫుడ్ మెనూ ఇదే

కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా

Published

on

food giving to corona patients in quarantine centers

కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా

కరోనా వైరస్.. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 209 దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వేలాది మందిని బలితీసుకుంది. దీంతో కరోనా పేరు వింటేనే జనాలు హడలిపోతున్నారు. మాస్క్ లో ప్రాణాలు పెట్టుకుని బతికేస్తున్నారు. కాగా కరోనా సోకిన వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తారు? ఏ మెడిసిన్ వాడతారు? చికిత్స సమయంలో వారికి ఎలాంటి ఆహారం(ఫుడ్ మెనూ) ఇస్తారు? అనేది ఆసక్తికరం.

రోగనిరోధక శక్తి పెంచేందుకు పౌష్టికాహారం:
ప్రపంచ దేశాల సంగతి ఏమో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే.. జీడిపప్పు, బాదం, గుడ్లు.. క్వారంటైన్ కేంద్రాల్లో కరోనా బాధితులకు ఇచ్చే ఆహారం ఇదే. కరోనా వైరస్‌కు సంబంధించి క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి పెంచడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రోజు వైద్య పరీక్షలతో పాటు.. దుస్తులు, టవల్స్, దుప్పట్లను అధికారులు అందజేస్తున్నారు. వీరికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సహకారం అందిస్తున్నాయి. 

కూర, పప్పు, రసం, సాంబారు, పెరుగుతో భోజనం:
కృష్ణా జిల్లాలో మొత్తం 19 క్వారంటైన్‌ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో ప్రస్తుతం 16 కేంద్రాల్లో 450 మంది వ్యక్తులు ఉన్నారు. వీరికి రోజూ కూర, పప్పు, రసం, సాంబారు, పెరుగుతో భోజనం పెడుతున్నారు. వీటికి అదనంగా కోడిగుడ్డు, అరటిపండు, బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, కొబ్బరి నీళ్లు అందజేస్తున్నారు. రోజువారీ జీవనానికి అవసరమైన 15 రకాల వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. వీటిలో పేస్టు, బ్రష్‌, సబ్బులు తదితరాలు ఉన్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *