ఫస్ట్ టైమ్, లడక్‌లో మహిళా డాక్టర్లను మోహరించిన ITBP

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) తొలిసారిగా లడక్ లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో మహిళా డాక్టర్లను నియమించింది. లేహ్ నుంచి పంపే దళాల సంరక్షణను మహిళా డాక్టర్లు చూసుకుంటారు. వారికి అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. బోర్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఐటీబీపీ కీలక నిర్ణయం తీసుకుంది.సాధారణంగా ఎల్వోసీలో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండే లోకేషన్లలో మహిళా డాక్టర్లను నియమించరు. కానీ ఐటీబీపీ తొలిసారిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడర్(SOP)లో మార్పులు చేసింది. జెండర్ తో సంబంధం లేకుండా మహిళా డాక్టర్లు, ఇతర సిబ్బందిని ఐటీబీపీ రంగంలోకి దింపింది.

బెంగళూరు మహిళకి నెల తర్వాత రెండోసారి కరోనా పాజిటివ్


గతంలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్వోసీ) సమీపంలోని ప్రాంతాలకు కేవలం పురుష డాక్టర్లను మాత్రమే పంపేవారు. ఇప్పుడు అందులో మార్పు చేశారు. మహిళా డాక్టర్లను కూడా అపాయింట్ చేశారు. ఐటీబీపీ అధికారుల ప్రకారం, లేహ్ లోని బోర్డర్ ఏరియాలో మహిళా డాక్టర్లను విధుల్లోకి దింపారు. వారు భద్రతా దళాల సంరక్షణ చూస్తారు. అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే ట్రీట్ మెంట్ ఇస్తారు. మహిళా డాక్టర్లు భద్రతా దళాల వైద్య అవసరాలను పర్యవేక్షిస్తారు. వ్యూహాత్మక లోకేషన్లలో మహిళా డాక్టర్లను నియమించారు. భద్రతా దళాల ఆరోగ్య సంరక్షణ బాధ్యత చూసుకుంటారు.

కేవలం డాక్టర్లే కాదు.. ఫార్మసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్లను కూడా పెద్ద సంఖ్యలో నియమించారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేలా వారికి అన్ని రకాల వైద్య పరికరాలు సరఫరా చేశారు. దేశానికి చెందిన వివిధ ప్రాంతాల నుంచి దళాలు లేహ్ కు వస్తుంటాయి. విధుల్లోకి చేరే ముందు వారంతా మెడికల్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిట్ నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను కూడా మహిళా అధికారులకు అప్పగించారు.

డాక్టర్ కాత్యాయని శర్మ మెడికల్ బేస్ ను లీడ్ చేస్తున్నారు. ఈ బేస్ కు ఆమే ఇంచార్జ్. ఫిట్ గా ఉన్న దళాలను మాత్రమే విధుల్లోకి పంపే బాధ్యత ఆమెదే. ప్రతి ట్రూప్ మూడు దశల మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ గా డాక్టర్ శర్మ చెకప్ చేస్తారు. ఆ తర్వాతే ట్రూప్స్ కి డాక్టర్లు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు.

Related Posts