Forest MLA Sangameshwara Forest Warnings on Forest Officer

కాళ్లు,చేతులు నరికేస్తా జాగ్రత్త : ఎమ్మెల్యే  బెదిరింపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బెంగళూరు : కాళ్లు, చేతులు నరికేస్తా జాగ్రత్త అంటూ ఓ ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే బెదిరింపులు వైరల్ గా మారాయి. కర్ణాటకలోని భద్రావతి ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్ పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర బెదిరింపులు  సంచలనానికి దారి తీశాయి.  కర్ణాటకలోని భద్రావతి ప్రాంతంలో గ్రామస్థులందరూ కలిసి ఓ గుడిని కట్టాలనుకున్నారు. దీనికి శంకుస్థాపన కూడా చేశారు. ఈ క్రమంలో గుడి నిర్మిస్తున్న ల్యాండ్ ఫారెస్ట్ కు సంబంధించిన భూమి అని..గుడి  కట్టేందుకు అనుమతి లేదని..ఒకవేళ్ల కట్టాలి అనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని చెబుతు గుడి పనులను  అడ్డుకున్నారు. 

దీంతో గ్రామస్థులంతా స్థానిక ఎమ్మెల్యే బీకే సంగమేశ్వరకు తెలపటంతో భద్రావతికి చేరుకున్న సంగమేశ్వర.. గ్రామస్థుల ముందే సంబంధిత ఫారెస్ట్  అధికారికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే చెడామడా తిట్టేశారు. అంతటితో ఊరుకోకుండా..‘‘గుడి పనులు అడ్డుకుంటే అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని..మంచిగా చెబితే అర్థం చేసుకో..కాళ్లు చేతులు నరికేస్తానని’’ హెచ్చరించారు. మంచిగా చెబితో అర్థం చేసుకో..లేదంటే నీ కాళ్లు, చేతులు విరిచేస్తానని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వీడియో బయటకు రావడంతో సంగమేశ్వరపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సంగమేశ్వర బెదిరింపులపై కాంగ్రెస్ నేతల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటం గమనార్హం.
 

Related Posts