Former Andhra Pradesh's Guntur MLA died at 72

గుంటూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు (72) అనారోగ్యంతో కన్నుమూశారు. కాంగ్రెస్‌ నుంచి 1985, 1994 లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చదలవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా సేవలు అందించారు.

చదలవాడకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మరణ వార్త తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు చదలవాడ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

చివరివరకు కూడా చదలవాడ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాగా, చదలవాడ అంత్యక్రియం రేపు మధ్యాహ్నం గుంటూరులో జరుగనున్నాయి. చదలవాడ మృతి పట్ల పలువురు సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Related Posts