సింగర్ గా మారి…శ్రీరాముడి భక్తి కీర్తనలతో భజన చేసిన మాజీ సీఎం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు.రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కార్యక్రమంగా అంగరంగ వైభవంగా జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ భూమి పూజను చేశారు ప్రధాని మోదీ. దేశమంతటా అయోధ్య శోభ కనిపిస్తోంది. అందరి నోటా శ్రీరాముడి స్మరణే వినిస్తోంది.దేశవ్యాప్తంగానూ అందరూ రాముడి పూజలో తరించారు. అయోధ్య‌లో భూమిపూజ సంద‌ర్భంగా బుధ‌వారం దేశం అంత‌టా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. అన్ని రాష్ట్రాల‌ బీజేపీ నాయ‌కులు త‌మ పార్టీ కార్యాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. భ‌క్తిగీతాలు ఆల‌పించారు. ముంబైలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సింగర్‌గా మారి పాటలు పాడారు. శ్రీరాముడి కీర్తనలతో భజనలో పాల్గొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Related Posts