former pakistan cricketer tests coronavirus positive

మాజీ క్రికెటర్ కు కరోనా, తన కోసం ప్రార్థించాలని రిక్వెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పేద లేదు, ధనిక లేదు.. చిన్నా లేదు, పెద్దా లేదు.. కరోనా వైరస్ మహమ్మారి అందరిని అటాక్ చేస్తోంది.

పేద లేదు, ధనిక లేదు.. చిన్నా లేదు, పెద్దా లేదు.. కరోనా వైరస్ మహమ్మారి అందరిని అటాక్ చేస్తోంది. సెలబ్రిటీలను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో మాజీ క్రికెటర్ కు కరోనా సోకింది.

త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి:
పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తౌఫీక్‌ ఉమర్‌కు కరోనా వైరస్‌ సోకింది. శనివారం(మే 23,2020) రాత్రి అతడికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీనిపై అతడు స్పందించాడు. ‘‘నిన్న రాత్రి కొద్దిగా అనారోగ్యంగా ఉండటంతో రాత్రే కరోనా వైరస్‌ పరీక్షలు చేయించుకున్నా. పరీక్షల్లో వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. అయితే నాలో వైరస్‌ లక్షణాలు పెద్దగా కనిపించ లేదు. ప్రస్తుతం మా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటున్నా. నేను త్వరగా కోలుకోవటానికి అందరూ ప్రార్థనలు చేయండి’’ అని కోరాడు.

పాక్ జట్టులో కీలక ప్లేయర్:
ఒకానొక స‌మ‌యంలో పాక్ జట్టులో వన్డే, టెస్ట్ క్రికెట్‌లో కీలక ప్లేయ‌ర్ గా కొనసాగాడు ఉమర్. 2001లో బంగ్లాదేశ్‌ టెస్ట్ మ్యాచ్‌తో ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఉమర్… తొలి మ్యాచ్‌లోనే 163 బంతుల్లో 104 పరుగులతో తనేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్ లో పాక్ ఇన్నింగ్స్, 264 ర‌న్స్ తేడాతో ఘ‌న‌ విజ‌యం న‌మోదు చేసింది. ఇమ్రాన్ నజీర్, సల్మాన్ బట్ లతో అద్భుత ఓపెనింగ్ పార్ట‌నర్షిప్స్ నెలకొల్పిన ఈ లెఫ్టాండర్ బ్యాట్స్‌మన్‌.. ఫిట్ ‌నెస్ సమస్యల కార‌ణంగా జట్టుకు దూరమయ్యాడు. 2014లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడాడు.

నలుగురు క్రికెటర్లకు కరోనా:
మొత్తం మీద‌ 44 టెస్ట్‌లు, 22 వన్డేల్లో పాక్ త‌రుపున బ‌రిలోకి దిగిన‌ తౌఫీక్ ఉమర్.. టెస్ట్‌ల్లో 7 సెంచరీలు, 14 అర్ధ సెంచ‌రీల‌తో 2963 రన్స్ చేశాడు. వన్డేల్లో మాత్రం 504 ప‌రుగులే చేశాడు. కెరీర్ మొత్తం జ‌ట్టులోకి వస్తూ, వెళ్తూ నిల‌క‌డ‌లేమితో గ‌డిపిన‌ తౌఫిక్.. 2016లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం కొనసాగాడు. తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ను 2018 అక్టోబర్ లో ఆడి అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. కాగా, ఇప్పటివరకు ఉమర్‌తో కలిపి మొత్తం నలుగురు క్రికెటర్లకు వైరస్‌ సోకింది. మజిద్‌ హక్‌(స్కాట్‌లాండ్‌), జఫర్‌ సర్ప్‌రాజ్‌(పాకిస్తాన్‌), సోలో నక్వెనీ(సౌత్‌ ఆఫ్రికా)లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకిన క్రికెటర్లలో ప్రాముఖ్య‌త క‌లిగిన‌ క్రికెటర్ తౌఫిక్ ఉమరే.

Read: టీ20 ప్రపంచ కప్ జరిగేనా 

Related Posts