లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆస్తి కోసం సవతి తల్లిని రేప్ చేసిన టీవీ నటుడు …దొంగతనం కేసు నమోదు

Published

on

Forty Years old Mumbai tv actor booked for rape of stepmother, and stealing from her house : డబ్బు కోసం జనం ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్న రోజుల్లో మనం బతుకుతున్నాం. బంధాలు , అనుబంధాలు, ఆప్యాయతలు. వావి వరసలు మర్చిపోయి మనుషులు మృగాళ్ల లా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచిన ఓ కామాంధుడు సవతి తల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన ముంబై లో చోటు చేసుకుంది.

ముంబైలోని ఓషివోరా పోలీసు స్టేషన్ లో టీవీ సీరియల్స్ లో నటించే 40 ఏళ్ల నటుడిపై కేసు నమోదైంది. తాను ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి….తనను రేప్ చేసి, ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, దోచుకెళ్లినట్లు అతని సవతి తల్లి(58) ఫిర్యాదులో పేర్కోంది. బాధితురాలు నటుడి తండ్రి(78)కి మూడవ భార్య. నిందితుడు టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేస్తుండగా, అతని తండ్రి హిందీ టీవీ సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు.

బాధితురాలు అంథేరిలోని లోంఖడేవాలే కాంప్లెక్స్ లో నివసిస్తున్నారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా…..నిందితుడికి, బాధితురాలికి మధ్య ఆస్తి వివాదాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆమె తన భర్త నుంచి విడిపోయినప్పుడు వచ్చిన ఆస్తికి సంబంధించి వివాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కేసు గురించి ఓషివారా సీనియర్‌ పోలీస్‌ అధికారి సంజయ్‌ బండలే మాట్లాడుతూ.. ఆరోపణలు రుజువైతేనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. నటుడి పేరు, తదితర వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడిపై రేప్, దొంగతనం కేసులు నమోదు చేశారు.