Home » నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేరోజు నలుగురు కరోనా రోగులు మృతి
Published
7 months agoon
By
nagamaniతెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న నలుగురు కరోనా రోగులు ఒకేరోజు మృతి చెందారు. ఈ ఘటనస్థానికంగా కలకలం రేపింది. నలుగురు కరోనా రోగులు ఒకేరోజు..ఒకేసారి మృతి చెందటంతో కలెక్టర్ నారాయరణ రెడ్డి ప్రభుత్వాసుపత్రికి సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆక్సిజన్ అందకపోవటం వల్లనేవారు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కరోనాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే..అధికారులు దానికి తగిన ఏర్పాట్లు చేయకుండా ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది కూడా కరోనా పేషెంట్ల పట్ల ఏమాత్రం బాధ్యత వహించకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటను సంబంధించిన విషయాలపై కలెక్టర్ నారాయణ రెడ్డి విచారిస్తున్నారు.
ఒకేరోజు కరోనా పేషెంట్లు చనిపోవటానికి ఆక్సిజన్ అందకపోవటమా? వ్యాధి తీవ్రత వల్లనా..లేదా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే..అసలు కరోనా పేషెంట్లు ఎప్పుడు జాయిన్ అయ్యారు? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆస్పత్రి సూపరిండెంటెంట్ ను ఆదేశించారు. దీంతో సూపరిండెంటెంట్ క్రిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి డాక్టర్ల వరకూ విచారించి నివేదిక ఇస్తామని తెలిపారు. దీనికి నిర్లక్ష్యమే కారణమైతే వారు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాడని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
Read Here>>ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల యోజన: సెప్టెంబర్ వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు