లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

bhakti

2021లో నాలుగు గ్రహణాలు.. ఇండియాలో రెండే కనిపిస్తాయంట!

Published

on

Four eclipses in 2021, two to be visible in India : 2021 ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు కనువిందు చేయనున్నాయి. ఒక సంపూర్ణ సూర్యగ్రహణం, ఒక సంపూర్ణ చంద్రగ్రహణంతో కలిపి మొత్తం నాలుగు గ్రహణాలు జరుగబోతున్నాయి. అయితే భారత్ లో మాత్రం రెండు గ్రహణలే కనిపిస్తాయంట. ఉజ్జయిన్‌కు చెందిన జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ రాజేంద్రప్రకాష్ గుప్త్ తెలిపారు.

వచ్చే ఏడాదిలో మొదటిది మే 26న జరుగుతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్, తీర ఒడిశా సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో కంటే ఈ ప్రాంతాల్లోనే చంద్రుడు ముందుగానే కనిపిస్తాడంట. భూమి 101.6 శాతం చంద్రుడిని కప్పివేస్తుందని ఆయన చెప్పారు. సూర్యుడు, చంద్రుల మధ్య భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవిస్తుంది. జూన్ 10న జరిగే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని రాజేంద్రప్రకాష్ గుప్త్ పేర్కొన్నారు.

సూర్యుడు,భూమి మధ్య చంద్రుడు వస్తాడని, సూర్యుడు 94.3 శాతం ఆవరించడంతో ‘అగ్ని వలయం’ గా కనిపిస్తుందని గుప్త్ చెప్పారు. నవంబర్ 19న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుందని, అరుణాచల్ ప్రదేశ్ అసోంలోని కొన్ని ప్రాంతాల్లోనే కొంత సమయం వరకే కనిపిస్తుందని చెప్పారు. గరిష్ట సమయం వరకు 97.9 శాతం చంద్రుడు భూమి నీడతో కప్పివేస్తుంది. 2021 చివరి డిసెంబర్ 4న సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదని గుప్త్ పేర్కొన్నారు. ఇక 2020 ఏడాదిలో రెండు సూర్య గ్రహణాలు, నాలుగు చంద్ర గ్రహణాలు జరిగాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *