The four men convicted in the 2012 Nirbhaya gang-rape Hanged

కామాంధుల కథ ముగిసింది.. ఉరి పడింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా ఎందరో ఆగ్రానికి గురైన ఘటన.. న్యాయం కోసం ఓ తల్లి ఏడేళ్లుగా పోరాడుతూ ఉంది. నిర్భయ అనే వైద్య విద్యార్ధిని దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసింది. ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరగింది. ఆ దురాగతానికి పాల్పడిన కామాంధుల కథ ముగిసింది.. చట్టపరంగా.. ఉరి వేశారు తీహార్ జైలు అధికారులు. సరిగ్గా 5గంటల 30నిమిషాలకు నలుగురు దోషలులను ఒకేసారి ఉరి తీశారు జైలు అధికారులు. 

నిర్భయ హత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులు అరెస్ట్ అవగా.. రామ్ సింగ్ అనే ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో మరొక వ్యక్తి మైనర్ కావడంతో జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగిలిన నలుగురు నిందితులు.. వినయ్ శర్మ,  పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముకేష్ సింగ్‌లకు కోర్టు 2017లో ఉరిశిక్ష విధించగా.. అది అమలు కావడానాకి ఇంతకాలం పట్టింది. 

ఈ కేసులో అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేయబడి, అంతకంటే భయానకంగా హత్యచేయబడిన ‘నిర్భయ’కు మన చట్టాలు, న్యాయస్థానాలు ఇప్పటికి న్యాయం చేయగలిగాయి. చట్టాల్లోని లొసుగులున్నీ వాడుకుంటూ ఉరిశిక్ష ముందుకు వచ్చిన తర్వాత కూడా చట్టాల్లోని లొసుగులున్నీ వాడుకుంటూ వాయిదా పడేలా చేసుకున్నారు దోషులు. ఈ క్రమంలో ఉరి మూడు సార్లు వాయిదా పడింది. ఉరికి రెండు గంటల ముందు కూడా సుప్రీం కోర్డులో ఉరిపై స్టే విధించాలని పిటీషన్ వేశారు. అయితే దానిని అత్యున్నత న్యాయస్థానం వెంటనే కొట్టివేసింది. 

డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా వారిలో ఒకడు.. తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో విడుదలయ్యాడు. మిగిలిన నలుగురికి నేడు ఉరిశిక్ష పడింది. 

See Also | నిర్భయ తల్లిని శిక్షించాలి..దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు

Related Tags :

Related Posts :