fraud in the name of jobs in Tirumala

తిరుమలలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తిరుమల కొండ దళారులకు అడ్డాగా మారుతోంది. తిరుమలలో ఉద్యాగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలలో ఉద్యాగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లడ్డూ కౌంటర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. ఒక్కో ఉద్యోగానికి 50వేల వరకూ వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదులో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తిరుమల కొండ దళారులకు అడ్డాగా మారుతోంది. శ్రీవారి సేవా టిక్కెట్లు మొదలు, అద్దె గదులు..లడ్డూల విక్రయం వరకు అన్ని చోట్లా బ్లాక్ మార్కెటింగ్ దందా యథేచ్చగా కొనసాగుతోంది. వెంకన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలా సులువుగా దళారుల మాయలో పడుతున్నారు. ఈ వ్యవహారంలో దళారులు నిత్యం వేల రూపాయలు దండుకుంటుండగా, మరో వైపు ఫోర్జరీ పత్రాలతో దర్శనాలకు వెళ్లే భక్తులు చివరకు విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడి అభాసుపాలవుతున్నారు. 

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ ఏడుకొండల వాడిని రెప్పపాటు దర్శించుకుంటే చాలా అదే మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. స్వామి దర్శనం కోసం దేనికైనా సై అంటారు.. ఎంతైనా డబ్బులు ఇస్తామంటారు. భక్తుల్లోని ఆ ఆలోచనే దళారులకు పెట్టుబడి. తిరుమల కొండపై ఏళ్ల తరబడి ఈ దళారుల దందా కొనసాగుతోంది. ఏం కావాలన్నా చకచకా ఏర్పాటు చేస్తామని భక్తులను దళారులు సులువుగా మాయలో పడేస్తుంటారు. ఎన్నో వ్యయప్రయాసలతో తిరుమల కొండపైకి చేరుకునే భక్తులు… స్వామి దర్శనం కోసం దళారులకు డిమాండ్లకు సులువుగా తలూపుతుంటారు. 

తిరుమల కొండపై దళారుల అక్రమ దందా ఈనాటిది కాదు. అనేక ఏళ్లుగా ఇది రకరకాలుగా కొనసాగుతోంది. కొందరు దళారులు భక్తులకు వారు అడిగినవన్నీ సమకూర్చి అదనంగా వేల రూపాయలు దండుకుంటారు. ఇంకొందరు దళారులు… మాయమాటలు చెప్పి భక్తుల వద్ద నుంచి డబ్బులు దండుకొని తర్వాత కనిపించకుండా పోతారు. ఇవి కాకుండా… దళారులు నకిలీ వీఐపీ లెటర్లతో సమకూర్చిన దర్శన టిక్కెట్లు పొందిన భక్తులు, చివరకు ఆలయంలో విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడిపోతుంటారు. అవమానంతో ఆలయం నుంచి బయటకు వచ్చే భక్తులు కన్నీరుమున్నీరవుతుంటారు. అద్దె గదులు తీసివ్వడం, బ్లాక్ మార్కెట్‌లో లడ్డూల విక్రయం.. ఇలా ప్రతీ దాంట్లో దళారుల దందా కొనసాగుతుంటుంది.
 

Related Posts