లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఇంటికే కరోనా కిట్, తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, కిట్‌లో ఏమేం ఉంటాయంటే

Published

on

free-home-isolation-kit-to-home-telangana-government-key-decision

కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు, శానిటైజర్లును ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది.

10వేల మందికిపైగా ఇంట్లోనే ఉండి చికిత్స:
రాష్ట్రంలో కరోనా కేసులు ఉధృతమవుతున్నాయి. అంతే స్థాయిలో కరోనా తీవ్రత తక్కువగా ఉండి ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపు 10వేల మందికిపైగా కరోనా బాధితులు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీరిలో తొలుత ఎటువంటి లక్షణాలు లేకపోయినా, రెండు మూడు రోజులు గడిచేసరికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు స్వల్ప స్థాయిలోనైనా బయటపడుతున్నాయి. కొందరిలో లక్షణాలతో కోవిడ్ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో తమ ఆరోగ్యంపై బాధితుల్లో ఆందోళన నెలకొంటోంది.

Coronavirus medicine stock in India: How long will India's ...

ఏం మందులు వాడాలి? ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి?
ఏం మందులు వాడాలి? ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలి? అనే ఆలోచనలు వారిలో భయాందోళనలను మరింత పెంచుతున్నాయి. ఒక్కసారి పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలుండదు. మరో మనిషి తోడు లేని పరిస్థితుల్లో మందుల కోసం బాధితుడే తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తుంది. ఇది సామాజిక వ్యాప్తికి కారణం అవుతుందనే అవగాహన బాధితుల్లో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. పైగా, ఆ మందులు సరైనవేనా? ఎంత మోతాదులో వాడాలి? అనే పరిజ్ఞానం కూడా ఎక్కువమందిలో ఉండదు.

Fujifilm ties up with Indian firm on potential COVID-19 drug Avigan

మార్గనిర్దేశం లేకుండా ఔషదాలు వాడటం వల్ల దుష్పలితాలు:
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకునో, ఎవరైనా తెలిసినవారు చెప్పింది వినో మందులు వాడాల్సి వస్తోంది. సరైన మార్గనిర్దేశం లేకుండా ఔషదాలు వాడటం వల్ల దుష్పలితాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. హోం ఐసోలేషన్ బాధితులు అనుభవిస్తున్న ఈ అవస్థలన్నింటిని దృష్టిలో పెట్టుకుని వారి దగ్గరికే ఔషధాలను అందించాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. కరోనా లక్షణాలు ఉన్నవారు 15 రోజుల పాటు ఇంట్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి, అందుకు తగ్గట్టుగానే కిట్ లో ఔషధాలు, వస్తువులు సమకూర్చుతోంది ప్రభుత్వం.

Follow strictly! New home isolation guidelines for mild COVID-19 ...

ఉచితంగా ఇంటికే హోమ్ ఐసోలేషన్ కిట్:
మున్ముందు కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళన నెలకొనడంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కిట్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. బాధితుడు ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడనే సమాచారాన్ని వైద్య అధికారులు నిర్దారించుకోగానే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాల నుంచి కిట్లను నేరుగా వైద్య సిబ్బంది బాధితుడి ఇంటికెళ్లి కరోనా కిట్ ను అందజేస్తారు. ఇంట్లో ఒకరి కన్నా ఎక్కువ మంది ఉన్నా సరే, బాధితులందరికి కిట్లను ఇస్తారు. వైద్య సిబ్బంది నిత్యం ఫోన్ ద్వారా బాధితుల ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటుంది. ఇలా బాధితులకు ప్రభుత్వం బాసటగా నిలవనుంది.

హోం ఐసోలేషన్ కిట్‌లో ఏముంటాయి?
* ఔషధాలు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు
* లివోసెటిరిజైన్
* ఎసిడిటీని తగ్గించే మాత్రలు
* కరోనాపై అవగాహన పెంచే పుస్తకం
* హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు
* పారాసెటమాల్ మాత్రలు
* యాంటీ బయాటిక్స్
* విటమిన్ సీ, ఈ, డీ3 మాత్రలు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *